తేటగీతి మాలిక /============వాన నీటిలో రంగుల పడవ లనెడిచిత్ర రాజము దోచెను చిత్తమిపుడు.నీలి నీటిలో పడవలు తేలి పోయిరాలు చినుకుల వానలో రయ్యి మనుచుసాగు చుండగ బాల్యపు జ్ఞాపకాలుసుళ్ళు తిరుగుచు వేగమే చొచ్చుకొచ్చితట్టి లేపెను నా మది తలపు నిపుడు.మరలి రానట్టి చిన నాటి మధుర మైనస్మృతుల నీడలో నిమిషము సేదతీరిచిలిపి యల్లరి చేసిన చిగురు దశనిమనసు పెట్టెలో పెట్టినే మరలి రాగవెచ్చ నైనట్టి కన్నీరు వచ్చె నిపుడు.చెమ్మ గిల్లిన కళ్ళతో చెప్పు కొంటికాగితంబుల పడవపై కవిత నొకటితీయ నైనట్టి మన భాష తెలుగు లోన.----------------------
చిన్ననాటి స్మృతి;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి