విశ్వ విజేత;---కవిరత్న నాశబోయిన నరసింహ(నాన), Health Supervisor, 8555010108
నృష్టి ప్రసవించినపుడు
నమస్య శిశువుతో పాటు
ఉమ్మనీటి సమాధానం పుట్టింది
ప్రతీ దారిద్ర్య విషానికి విరుగుడు కషాయం ఉంది!

ధీరోధాత్తా! ఆత్మవిశ్వాసం తోడైతే!!
నీ అంతరాన పుష్పించే ఉత్పత్తి వనరులు 
విశృంఖల శ్రమశక్తి వినియోగంతో
ఆర్థిక దారిద్ర్యం తరిమే కలియుగ కుబేరుడివి!

స్నేహితుడా! ఆత్మవిశ్వాసం తోడైతే!!
నీ అంతరాన పారిశుద్ధ్య పోషకాహార పరిజ్ఞానం                                         
 అవగాహణామృత ఆస్వాధనతో
ఆరోగ్య దారిద్ర్యం తరిమే స్వస్థ సురక్షకునివి!

నెచ్చెలీ! ఆత్మవిశ్వాసం తోడైతే!!
నీ అంతరాన నివురుగప్పిన అక్షరాగ్ని                                                                                                  
నిరంతర అభ్యసన సాధనతో                                                                    
 అక్షర దారిద్ర్యం తరిమే బహుముఖ ప్రజ్ఞాశాలివి!

ఆజానుబావా! ఆత్మవిశ్వాసం తోడైతే!!
నీ అంతరాన నిరహంకార నిర్మలత్వం
అనంత విశ్వశాంతి పరివ్యాప్తితో                          
ఆధ్యాత్మిక దారిద్ర్యం తరిమే జ్ఞాన ప్రబోధకుడివి!

భజరంగభళీ! ఆత్మవిశ్వాసం తోడైతే!!
నీలో అపార నైపుణ్య సృజన దీప్తి                                                                            
నీలాకాశానికి నిచ్చెనేసి అతికించిన                                     
తళుకుల ధృవతారలా ప్రకాశిస్తూ                                                     
ఉద్యోగ దారిద్ర్యం తరిమే విశ్వవిజేతవి!

బాహుబలీ! ఆత్మవిశ్వాసం తోడైతే!!
నీ అంతరాన అమోఘ సేవా తపన
కొమ్మ రెమ్మలకు వేలాడే కుసుమ ఫలాలు
ఆర్హులకందించే మహా మార్గదర్శివి!

సేవకుడా! ఆత్మవిశ్వాసం తోడైతే!!
ఈ అద్భుత విశ్వంలో 
పరిమళించే మానవత్వం ఆచంద్ర తారార్కం
తనువు తాత్కాలికం సేవే శాశ్వతం!


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం