పాపం ఇడ్లీ!!;-- జగదీశ్ యామిజాల
 ఇడ్లీ  +  వడ  + సాంబారు......
ఇడ్లీ సాంబారూ ఒక్కటిగా గాఢంగా ప్రేమించుకుంటున్న రోజులవి.
అప్పుడు కొత్తగా వాటి మధ్య చేరింది వడ.
ఇప్పటివరకూ మృదువైన ఇడ్లీని మాత్రమే రుచి చూస్తూ ఆస్వాదిస్తూ వస్తున్న సాంబారుకి వడమీద క్రమంగా మోహం ఏర్పడింది. వడ రుచి క్రమంగా నచ్చడం మొదలైంది. 
వడమీద మోజు పెంచుకుంటున్న సాంబార్ విషయాన్ని గ్రహించిన ఇడ్లీ "సాంబారు నాకే సొంతం" అని వాదనకు దిగింది వడతో.
కానీ ఇడ్లు మాటలను లెక్కచేయని వడ సాంబారు తన మనిషి అని గట్టిగా వాదించింది.
ఇద్దరి వాదనలు విన్న సాంబారు కిసుక్కున ఓ నవ్వు నవ్వింది. దాంతో ఇడ్లీకీ వడకూ సాంబారు మీద కోపమొచ్చి గొడవకు దిగింది.
సాంబారూ సాంబారూ నీకెవరిష్టమో చెప్పు...మెత్తగా ఉండే నేనా లేక సలసలా కాగే నూనెలో మాడే వడ ఇష్టమా ...చెప్పు ముందు అని ఇడ్లీ సాంబారుని నిలదీసింది.
కానీ వడ ఊరుకోక దాడికి దిగింది. పిడికిలి బిగించి కొట్టిన వడ దెబ్బలకు మృదువైన సున్నితమైన ఇడ్లీ తట్టుకోలేకపోయింది. ఎదురుదాడి చేసే శక్తి లేక అలసిపోయింది. ఇడ్లీకి ఓపిక లేకపోయింది.
దాంతో వడ, సాంబారు ఒక్కటై పెళ్ళి చేసుకుని హ్యాపీగా బతికాయి.
పాపం ఇడ్లీ...
సాంబారు తనను కాదని వడతో కాపురం చేయడం చూడలేక చతికిలబడింది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం