నువ్వు - దేవుడు!;- - తమిళకవి కణ్ణదాసన్;0 అనుసృజన ; - జగదీష్ యామిజాల
నువ్వెదుగుతున్నావంటే
"భగవంతుడు 
ఎదగనిచ్చి చూస్తున్నాడు" 
అని అర్థం!

నీ స్థాయి తగ్గుతోందంటే
"భగవంతుడు
ఆలోచించేలా చేస్తున్నాడు" 
అని అర్థం!

నీ ఎదుగుదల
భగవంతుడు
ప్రసాదించే మహిమ!!

నీ తరుగుదల
భగవంతుడు 
కల్పించే అణకువ!
 
ఆశయం నీది!
జరగనిచ్చేది భగవుతుడు!!
 


కామెంట్‌లు