బ్రహ్మ, నారద సంవాదంలో.....
గణపతికి పార్వతీ దేవి వరములు - దేవతల అగ్రపూజ - గణేశునకు సర్వాధ్యక్ష పదవి - గణేశ చతుర్ధి వర్ణన - స్థుతి.
*నారదా! శివుని త్రిశూలము చేత ఖండింపబడిన గణపతి, ఏకదంతము కలిగిన గజముఖమును అతికించడం వలన, దేవతలు ఇచ్చిన శివ శక్తి వల్ల పునరుజ్జీవనం పొందాడు. అలా ఏకదంతము కలిగిన గజముఖముతో ప్రాణము పోసుకున్న తన కుమారుడు గణపతి ని చూచి పార్వతి అమితానందము పొందింది. తన కుమారుని అక్కున చేర్చుకుని, ముద్దులు కుడిపింది. అందరి దుఃఖాలను పారద్రోలే తన చేతులతో, చల్లని తల్లి శాంభవి, గజముఖుని శరీరాన్ని తడిమి, దుఃఖహరుని చేసింది. గణనాయకులు అందరూ కూడా, శివపార్షదులతో కలిసి, గజాననుని పూజలు చేసారు. ఉమ, గణపతికి అనేక దివ్యమైన వరాలు ఇచ్చింది. "నాయనా! కుమారా! ఇప్పటి నుండి దేవతలు అందరూ, నీకు అగ్రపూజ చేస్తారు. నిన్ను దేవతలు, మునులు, ప్రజలు అందరూ, సిధూరముతో పూజ చేస్తారు. " సిధూర గణపతిగా" కొలుస్తారు. నీకు, ధూప దీప నైవేద్యాలతో పూజలుచేసి, సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తారు. నిన్ను పూజించిన వారి దుఃఖాలు తొలగి పోయి, అన్ని సిద్ధులూ లభిస్తాయి. వారికి, విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి."*
*శౌనకాది మునులారా! అప్పుడు పార్వతీ దేవిని ప్రసన్నం చేసుకుని, అంబ అనుమతితో గణపతిని శివుని వద్దకు తీసుకుని వెళ్ళాము. ఎంతో ఆదరముతో శంకర భగవానుడు గణపతిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. "ఈ గణపతి నా రెండవ కుమారుడు" అని చెప్పారు, శంకరులు. గణపతి శివుని అంక పీఠము నుండి దిగి, బ్రహ్మ విష్ణు రుద్రులమైన మాకు, ఇంద్రాదులకు నమస్కరించాడు. త్రిమూర్తులము అయిన మేము, ఆ గజానన కుమారునికి, అనేక వరములు ఇచ్చి, "ఈ రోజు నుండి త్రిమూర్తులము అయిన మేము జగత్తులో ఏవిధంగా పూజలు అందుకుంటామో, అలాగే, ఈ గణపతికి కూడా పూజలు జరగాలి. ముందుగా ఈ విఘ్నేశ్వరుని కి పూజ చేసి, మమ్మల్ని పూజించిన వారికి అన్ని ఫలములు కలుగుతాయి. సకల శుభాలకు ఈ గణపతి పట్టుకొమ్మగా ఉంటాడు." అని చెప్పారు. పార్వతిని ప్రసన్నం చేసుకునేందుకు త్రిమూర్తులు కలసి గజాననుని "సర్వాధ్యక్షుని" గా నియమించారు. ఈ నియామకంతో ప్రసన్నత పొందిన పార్వతీ పరమేశ్వరులు, గణపతికి మరల దివ్యమైన వరాలు ఇచ్చారు. గణపతి "గణాధ్యక్షుడు" అయ్యారు.*
*ప్రసన్న వదనంతో ఈశానుడు, గణపతిని చూచి, "శక్తి పుత్రా! ఉమా నందనా! నిన్ను ఎవ్వరూ ఎదిరించ లేరు, జయించ లేరు. నీవు అత్యంత పరాక్రమ వంతుడవు అవుతావు. ఎప్పుడూ, సుఖముగా ఉంటావు. విఘ్నములను నశింపజేసే కార్యములలో, అందరూ ముందుగా నిన్ను పూజిస్తారు. నీవు, ఈ రోజు నుండి నా శివ గణములకు కూడా అధ్యక్షుడిగా ఉంటావు." అని చెప్పారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి