*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 063*
 కందం:
*గుణవంతుని సంగతి ని*
*ర్గుణులకు గుణములు ఘటించు కుసుమాది సమ*
*ర్పణములన వస్త్రాదిక మా*
*క్షణమున పరిమళము నొందు కరణి కుమారా !*
తా:
కుమారా! పూల నుండి వచ్చే మంచి వాసన తగలిన బట్టలు కూడా మంచి వాసన అంటుంది. అలాగే, మంచి గుణములు కల వారితో స్నేహంగా, దగ్గరగా ఉండటం వల్ల, చెడు గుణములు కలిగిన వారికి కూడా మంచి గుణములు అబ్బుతాయి......... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఒక పూవుల తోటలో ఉన్న అన్ని పూల చెట్లు సువాసనను వెదజల్లక పోవచ్చు. కానీ, ఆ వనంలో ఒక్క సంపెంగ పూవు చెట్టు ఉన్నా, తోట అంతా సువాసనతో నిండి పోతుంది. అలాగే, ఒక మనుషుల సమూహంలో, ఒకరిద్దరు మంచి ఆలోచనలు కలవారు ఉన్నా కూడా, ఆ సమూహంలోని మిగిలిన వారి ఆలోచనలను ప్రభావితం చేయగలుగుతారు. అందువల్ల, ఆ సమూహంలో సానుకూల దృక్పథం ఏర్పడి ముందుకు సాగగలుగుతారు. మనమందరం ఒకే రకమైన మంచి ఆలోచనలతో కలసి ముందుకు సాగే అవకాశం కల్పించాలని....... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు