*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 066*
 కందం:
*మును మనుజుడు జన్మాంతర*
*మున చేసిన పుణ్య పాపములు పుడమిని వా*
*నిని బొందక విడువవు దే*
*వుని నిందింపకిము కీడు వొడుము కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద, ఇంతకు ముందు జన్మలలో మనుషులు చేసిన పాపాలు, పుణ్యాలను కష్ట సుఖాలుగా ఈ జన్మలో అనుభవించక తప్పదు. ఈ జన్మలో మనకు కలిగే కష్టాలకు దేవుని నిందించడం సరి కాదు. అలా నిందించి, ఇంకొంత కష్టాన్ని తెచ్చుకోవద్దు.......... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*మనం అనుభవించే కష్టాలు, సుఖాలు మనం చేసిన పాప పుణ్యాల ఫలితాలే అని మనకు, స్మృతులు, మన సంస్కృతి మనకు చెపుతూనే ఉన్నాయి. మనం ఆచరించే, అనుసరించే హిందూ ధర్మం కూడా ఇదే చెపుతుంది. కనుక, అవకాశం ఉన్నంతలో పుణ్య కార్యక్రమాలు చేస్తూ, నలుగురి మేలు గురించి ఆలోచిస్తూ మనం జీవితం గడిపేలా మనకు పరమేశ్వరుడు అనుజ్ఞ ఇచ్చి, చేయి పట్టి నడిపించేలా చేయమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు