కవి సమ్రాట్ (10);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 తరువాత తాను సినీ వ్యామోహంతో మద్రాసు వెళ్లి  చాలా చిత్రాలకు పాటలు వ్రాయడం  తమిళం నుంచి తెలుగులోకి  వచ్చేలా చిత్రాలకు మాటలు పేర్చడం  అంతకుముందు ఎంతమంది  ఆ పని చేసినా శ్రీ శ్రీ లా  విజయాన్ని సాధించిన వాళ్లు  లేరనే చెప్పాలి అరవంలో వణక్కం అని అంటారు  అంతవరకు వచ్చిన అనువాదాలు  చేసిన రచయితలందరూ దండం  నమస్కారం నమస్తే ఇలాంటి పదాలను వాడారు. ఆ పదాల వల్ల  పెదవుల  కదలిక  ప్రేక్షకులకు అర్థం అయిపోతుంది.  శ్రీ శ్రీ వచ్చిన తర్వాత  వందనం అను శబ్దానికి  పెదవులు కలిసే పదాన్ని తెలుగులో  వందనం అనిపించారు. ఆ సినిమాలు చేస్తున్న సమయంలోనే  తెలుగు భాషలో ఉన్న అనేక పదాలను  అధ్యయనం చేసి  దానికి సరిపడిన పదాలను కూర్చడం అలవాటు చేసుకున్నాడు  దానితో  నిర్మాతలు అతని వెంటపడ్డారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే  మొదటి అర్థం  ఈ జగతికే  అధిపతి అయిన జగన్నాథుడు పూరీ జగన్నాథ స్వామి  రథం వస్తుంది  ఆహ్వానం పలకండి అని చెప్పడం  రెండవది అతను  వామపక్ష సిద్ధాంతాలకు కట్టుబడినవాడు  ప్రపంచం మొత్తాన్ని ఒకటిగా ఏర్పాటు చేయాలని  ఆ రోజుల్లో రష్యా ప్రయత్నం చేస్తుంది  ఆ జగత్తును కలిపేటువంటి రథం  వస్తోంది  భారతదేశాన్ని కూడా దానిలో కలపండి  అన్న తన భావాన్ని వ్యక్తం చేశారు  ఇంక మూడవది  జగత్ అంటే  ప్రపంచ దేశాలు అన్నీ కలిసినది అన్న అర్థం కాకుండా  జగద్గురువు అని శంకరాచార్యుల వారిని ఎందుకు చెబుతున్నారు  భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు  ఆయన వెళ్ళలేదు  సన్యాసులకు విమాన ప్రయాణం నిషేధం అన్న విషయం ఆయనకు తెలుసు ఆయనను జగద్గురువు అన్నారు. మరి ప్రపంచాలను కలిపిన  జగతి అన్న అర్థం లో చెప్పారా  కాదు కదా. జ అంటే పుట్టడం  గతి అంటే మరణించడం  మరణం వేరు  చావు వేరు  చావు ఈ శరీరానికి సంబంధించింది  శాశ్వతముక్తిని పొందినది  మ అంటే  ప్రణాళికా బద్ధమైన  రణం యుద్ధం. నిత్యం మనం కళ్ళు తెరిచినప్పటి నుంచి కళ్ళు మూసే వరకు  జరిగే ప్రతి కార్యక్రమానికి  రణరంగంలో సైనికుడు ఎలా  కృషి చేస్తాడో మానవుడు కూడా అంతే  జీవన విధానం ఎలా ఉండాలి  ఏ ఏ సూత్రాలను పాటించి  సక్రమమైన జీవితాన్ని గడపాలో చెప్పినవారు  స్వామి శంకర  కనుక వారిని  జగద్గురు అంటున్నాం. కనుక మానవుడు అనేటువంటి రథం  చక్రాల తో నడుచుకుంటూ వస్తోంది  ఆ జీవితాన్ని  ఆహ్వానించండి, ఆస్వాదించండి  అని చెప్పేది  ఆ రోజుల్లో నాకు వాడికి దేవుడికి తప్ప మరొకరికి తెలియదు. ఇప్పుడు నాకు దేవుడికు మాత్రమే తెలుసు  అని తన స్వాతిశయాన్ని ప్రకటించుకున్నారు  విశ్వనాథ వారు.



కామెంట్‌లు