నాన్న జైలుకు వెళ్లి వచ్చే సమయానికి ముగ్గురు సంతానం ఆయన జైలులో ఉన్నప్పుడు వారితో పాటు శిక్ష అనుభవించిన ఒక స్త్రీ తో పరిచయం ఏర్పడింది. చెరసాల నుంచి విడుదలైన తరువాత ఇద్దరూ కలిసి గ్రామానికి వచ్చారు ఆమె కూడా సొంత ఇంటికి వచ్చినట్టుగా అనుభూతిని చెంది మా అమ్మను అక్క అని పిలిచేది. ముగ్గురు అన్నయ్యలను తన సొంత బిడ్డలుగా సాకేది. వీళ్ళు ముగ్గులు కూడా అమ్మానే పిలిచే వాళ్ళు. ఆమెను మా మేనమామలు వచ్చి ఆమెను బలవంతంగా బయటకు పంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అమ్మ తన అన్నలను అడ్డగించి ఆమెకు ఆశ్రయం ఇచ్చింది దానితో మేనమామలు ఆగ్రహంతో వెళ్లిపోయి కొంతకాలం అమ్మను వెలి వెలివేసినట్టుగా ప్రవర్తించారు. ఎంత బాధపడినా అమ్మ తమాయించుకుని నిలబడింది.
స్వామీజీని మూడు రోజులు ఉపన్యాసాలు ఇవ్వమని కోరి నాన్న అన్నీ ఏర్పాట్లు చేశాడు. దానికి మా మేనమామల సహకారం ఎంతో ఉంది వచ్చిన భక్తులకు అందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు ఆ మూడు రోజులు ఉదయం సాయంత్రం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఒకరోజు నాన్న మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్లి దగ్గరుండి స్వామీజీకి పాద పూజ చేయించారు చివరిగా హారతి ఇచ్చేటప్పుడు అమ్మ మేము ఐదుగురం హారతి కొల్లాది పట్టుకున్న సందర్భంలో నేను కుడి చేతితో పట్టుకోవడం కాకుండా ఎడమ చేతితో పట్టుకున్న విషయాన్ని గమనించి నన్ను తన ఒడిలోకి తీసుకొని ఆ చేతితో కాదు నాన్న ఈ చేతితో ఇవ్వాలి అని నా చేతిని మార్చారు. నన్ను వెన్ను తట్టి ఆశీర్వదించి అమ్మకు అప్పగించారు. ఆ క్షణాన నాకు అర్థం కాని వయసు తరువాత వయసు పెరిగిన తర్వాత ఏదో తెలియని విద్యుత్తు నాలో ప్రవహించినట్టుగా అనిపిం చింది వారి ఆశీర్వాద బలం నన్ను నిలబెట్టిందని నేను భావిస్తూ ఉంటాను. నాన్న జీవితంలో పది నెలలు ఆశ్రమంలో ఉండడం రెండు నెలలు ప్రచారం చేయడం ఇంట్లో చాలా తక్కువ రోజులు గడపడం ఆశ్రమ వాతావరణానికి తగ్గినట్లు ఆయన ప్రవర్తన ఉండడం మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేది విచ్చలవిడితనానికి పార్టీలకు స్వస్తి చెప్పారు. మలయాళం స్వామి ఆశ్రమంలో రకరకాల స్త్రీలు కనిపిస్తూ ఉంటారు కుటుంబం వదిలేసి వచ్చినవారు నిజమైన వేదాంతం తెలుసుకోవడానికి స్వామీజీ శిష్యురాండ్రుగా చేరడానికి వచ్చినవాళ్లు తినడానికి ఏ ఆధారం లేకుండా పస్తువులతో గడుపుతున్న కొంతమంది ఆశ్రమ నియమాలు తెలిసి జీవించడం కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వారితో కలిసిమెలిసి ఉంటూ కోరికలన్నిటిని గెలిచిన స్థిత ప్రజ్ఞునిగా ఉండడం మా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి