కొంతకాలం జరిగిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఇంటికి వచ్చి నాన్నను కలిసి మీ పేరుతో పదివేల రూపాయలు ఉన్నాయి ఇంతకుముందు మీరు వద్దని నిరాకరించారని తెలిసింది మీరు ఎలా ఆలోచించినా ఆ డబ్బు ముందు మీరు సొంతం చేసుకోండి ఆ తర్వాత మీ పద్ధతిలో ఎలా ఖర్చు చేయాలనుకుంటే అలా ఖర్చు చేయండి అంతే తప్ప ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టవద్దు చిన్నవాడినైనా ప్రభుత్వ ఉత్తర్వులు తెలిసినవాడిగా మాట్లాడుతున్నాను అని చెప్పినప్పుడు అంగీకరించక తప్పలేదు అప్పటికప్పుడు బ్యాంకులో ఆయన పేరుతో ఎకౌంటు ఓపెన్ చేసి ఆ పది వేల రూపాయలు వాళ్ల అకౌంట్ లో వేశారు. అలా నాన్న పదివేల రూపాయలకు అధిపతి అయ్యాడు.
నాన్న ఆ పది వేలు తీసుకొని మా ఐదుగురిని సంప్రదించడం కోసం పెద్దవాణ్ణి రెండోవాణ్ణి కలిస్తే మేం తక్కువలో ఉన్నాం కదా మాకేమన్నారు మూడవ అన్నయ్య నాకు ఉద్యోగం ఉంది కదా నాకు వద్దు అన్నాడు. నాల్గవ వాడు పొలం కొనుక్కుంటాను నీ పేరుతో ఉంటుంది అన్నాడు చివరిగా నా దగ్గరకు వచ్చాడు అప్పటికి నేను నా దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఇల్లు కట్టే ప్రయత్నంలో ఉన్నాను. పునాదులు లేచి ఉన్నాయి డబ్బు లేదు ఏం చేయాలో తెలియదు ఆ సమయంలో వచ్చారు నాన్నా ఏరా ఇల్లు కడుతున్నావు కదా డబ్బులు లేవు అంటున్నావ్ ఈ పదివేలు తీసుకొని కొంత పని చేయవచ్చు కదా అని మిగిలిన వాళ్ళు అన్న మాటలు చెప్పారు. నాకొద్దులే నాన్న నాకు డబ్బు వచ్చినప్పుడే పూర్తి చేసుకుంటాను అది పెద్ద సమస్య ఏం కాదు.
ప్రస్తుతం నీకు అమ్మకు వయసు అయిపోయింది. ఈ డబ్బులు చేతిలో ఉంటే ఎందుకైనా పనికొస్తాయి మీ దగ్గరే ఉంచండి అని చెప్తే మాకు ఏది వచ్చినా మాకు ఐదుగురు కొడుకులు ఉన్నారు రా అలాంటి భయాలు ఏమీ లేవు ఇంటి కోసం తీసుకో అంటే అలా కాదు నువ్వు చాలా ధర్మ కార్యాలు చేశావని నాకు తెలుసు మాకు ఐదుగురికి విద్యాధనం చేసింది మన ఉన్నత పాఠశాల ప్రతి ఉపాధ్యాయుడు మా కోసం కష్టపడ్డాడు. ఈ డబ్బుకు మరికొంత డబ్బు వేసి దానిపై వచ్చే వడ్డీతో మంచి మార్కులు వచ్చిన పిల్లలకు బహుమతులుగా ఏర్పాటు చేస్తే ఆ బహుమతుల కోసం మరి కొంత మంది పోటీపడి చదువుతారు అలా మీ పేరు అమ్మ పేరు శాశ్వతంగా ఉంటుంది అని చెప్తే సలహా బాగుందిరా ప్రభుత్వం వారు ఇచ్చిన 10000 గాక నా దగ్గర మరొక 15000 ఉన్నాయి. ఈ మొత్తం కలిపి కార్యవర్గ సభ్యులకు అందిస్తాను అని వెళ్ళిపోయాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి