కవి సమ్రాట్ (2);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 శాస్త్రి గారు రాసిన గ్రంథాలు అనుకోకుండా రాతప్రతులు అన్నీ అగ్నికి ఆహుతి కావటం  ఆంధ్రుల దురదృష్టం. ఆయన రాసిన ప్రతి అక్షరం శిరోధార్యం అలాంటివాడు భౌతికంగా మనకు దూరం కావడం ఎంతో విచారించవలసిన విషయం అంటూ  అద్భుతంగా చెప్పినవారు విశ్వనాథ సత్యనారాయణ గారు. వారు వ్రాయని సాహిత్య ప్రక్రియ లేదు. దానిని వారు చెబుతూ ఉంటే తమ శిష్యులు రామవరపు శరత్ బాబు, వెంకటేశ్వర్లు గారు రాస్తూ ఉండేవారు. వారికి ఎప్పుడు ఏది జ్ఞాపకం వస్తే అది చెప్పడం అలవాటు వచ్చిన  ఒకరు  పద్యం, రెండో వారు  నాటకం మూడో వారు కవిత రాస్తూ ఉంటారు.  ఆయన చెప్పడానికి  ముందు అయ్యత్త అయినప్పుడు నిన్న ఎంతవరకు చెప్పాను అని అడిగేవాడు కాదు. నిన్న ఏ వాక్యంతో పూర్తి చేశారో ఆ వాక్యానికి అనుగుణంగా కలిపి చెప్పే వారు.  అంత జ్ఞాపక శక్తి కలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు
అపశబ్దాలు మాట్లాడినా దానిని సమర్ధించుకోగలిగిన వాక్ పటిమ కలిగిన వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారు  ఒకరోజు కళాశాలలో వారు రాసిన వేయి పడగలు పుస్తకాన్ని  వారే పాఠం చెబుతున్నప్పుడు ఒక విద్యార్థిని పుస్తకం తీసుకురాలేదు  దానికి తగినట్టు కొంచెం ఆలస్యంగా వచ్చింది  ప్రతి ఒక్కరిని ఏక వచన ప్రయోగం చేయడం వారి అలవాటు ఆమె చెప్పిన సమాధానం విని   మర్చిపోయావా మోయలేకపోయావా ఇవాళ రెండు కేజీల పుస్తకాన్ని మోయలేని నీవు వివాహం అయిన తర్వాత  60 కేజీల మనిషిని ఎలా మోస్తావ్ అన్నారు  ఆ విద్యార్థిని స్నేహితుడు అదేమిటి మాస్టారు క్లాసులో బూతులు మాట్లాడటం తప్పు కదా  అందులోనూ ఆడపిల్లను అలా అడగడం సమంజసమా  అనగానే  నీకెందుకురా వెధవ కూర్చో  ప్రతి దాంట్లో వేలు పెట్టకురా లంజా కొడకా అనే సరికి అవమానాన్ని భరించలేక ప్రిన్సిపాల్  నక్కా అప్పారావు గారి దగ్గరికి వెళ్లి విషయం చెప్తే ఆయన వచ్చారు వచ్చి ఏం మాస్టారూ అలా బూతులు మాట్లాడవచ్చా అంటే ఎవర్రా బూతులు మాట్లాడింది ఏమిటి మాట్లాడాను రా వాడిని పొగిడాను రా అంతే తప్ప అది బూతు కాదు. మొదట సరస్వతి దేవిని రండ అంటే లంజా సంబోధించిన వారి పాడిన  సాక్షాత్తు తనకు అక్షరజ్ఞానం కలిగించిన అమ్మవారిని అలా అనడం పూర్తిగా భావ్యమా? లంజల కొడకా ఎక్కడ కుంజర యూధంబు  దోమ కుత్తుక జోచెన్ అని తెనాలి రామకృష్ణుడు ఈ దొంగ లంజ కొడుకులసలే మసలే ఈ లోకంలో తలవంచకు వెళ్లిపోయావా అని  శ్రీ శ్రీ బూతు పదాలుగా వాడారా  దాని అర్థం తెలియాలి మన భాష మనకు తెలియని దౌర్భాగ్య స్థితిలో మనం బ్రతుకుతున్నాం  లం అంటే నీరు లేక  భూమి  జ అంటే పుట్టినది  అది లక్ష్మీకావచ్చు సరస్వతి కావచ్చు మరి ఎవరైనా  కావచ్చు అది దైవ స్వరూపం కదా అన్నారు.


కామెంట్‌లు