మన గురువు ప్రకృతి (2); -డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఒక రాష్ట్రపతి స్థాయిలో ఉన్న వ్యక్తి  చేసిన పనిని చూసి మనం నేర్చుకోవలసినది ఏమిటి  భారతీయ సంస్కృతి సంప్రదాయం  ఎలా ఉండేది  ప్రతి దానిని తూ.చా తప్పకుండా వేద విహితమైన కార్యములనే ప్రతి ఒక్కరూ చేస్తూ ఉండేవారు పెద్దవారు వచ్చినప్పుడు వారికి నమస్కరించడం కనీస మర్యాద  తల్లికి తండ్రికి ఎలాంటి  కష్టం రాకుండా చూడడమే కాకుండా  మానసికంగా కూడా వారికి ఏ విధమైన బాధా కలిగించకూడదు అందరినీ తన లాగానే చూడాలి.  బంధుమిత్రులు మన ఇంటికి ఎవరు వచ్చినా వారిని ఆప్యాయంగా లోనికి ఆహ్వానించడం  ప్రయాణం చేసి అలసి వచ్చిన  ఆ అతిధికి ముందు మంచినీరు  వారు అడగకుండానే ఇవ్వడం  వారు సేద తీరిన తరువాత  మిగిలిన కార్యక్రమాలను ఏర్పాటు చేయటం. ఒక్కరు వచ్చినప్పుడు ఎలా గౌరవించాలి  దంపతులకు వచ్చినపుడు ఎలా చూడాలి  కుటుంబ సమేతంగా వచ్చిన వారిని ఎలా ఆదరించాలి  చిన్నపిల్లలు కదా అని  తనకన్నా తక్కువ వయసులో ఉన్న వారిని చూసి  వారితో మాట్లాడకుండా ఉంటే అతను  మానసిక వేదనకు గురవుతారు. కనుక అలాంటి పొరపాటు చేయకుండా చూడాలి. ఇలా చేసే పిల్లలు  తయారు కావడానికి ప్రతి తల్లి తండ్రి  అతను పుట్టినప్పటినుంచి  నిత్యం అతను చేసే పనులను గమనిస్తూ  అతడు సరిగా చేస్తున్నాడా లేదా  అని చూసి ఒకవేళ అతను వక్రమార్గంలో ఉంటే దానిని సరిచేసి  సక్రమమైన మార్గంలో  నడిపించడం వారి బాధ్యత  అలా కాకుండా మామూలుగా ఉన్నవారు  ఆ కుటుంబానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తూ ఉంటారు. మా వదిన మా ఇంటి కోడలుగా ప్రవర్తించదు  నాలాగనే సొంత కూతురులా ప్రవర్తిస్తుంది  అప్పుడప్పుడు వదిన తండ్రి వచ్చి వెళుతూ ఉంటాడు  మావయ్యతో మాట్లాడినప్పుడు  ఎన్నో హాస్యోక్తులు వస్తూ ఉంటాయి  ఆయన భోజనం చేసే పద్ధతి చూస్తే  మనకు ముచ్చట వేస్తోంది. తాను తింటున్న  పళ్ళెం నుంచి ఒక మెతుకు కూడా కింద పడకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ ఒకటి రెండు మెతుకులు కింద పడితే వాటిని తీసి పళ్ళెంలో వేసుకుంటారు. అది చూసి మా వదిన చూడు మరదలా ఎంత పిసినారో మెతుకు పోతే బ్రతుకు పోయింది అనుకునే స్థితిలో ఉంటారు వాళ్ళు అని ఎద్దేవగా మాట్లాడుతుంది.  కానీ ఒక సామాన్య రైతు తన పొలంలో  ఆ ఒక్క మెతుకును పండించడానికి ఎంత శ్రమ పడతాడో వదినకు తెలియదు ఎప్పుడు పొలానికి వెళ్ళిన పాపాన పోలేదు. ఆ కష్టం తెలిసినవాడు కనుక మామయ్య  అంత జాగ్రత్తగా ఉంటాడు అన్న కనీస  ఆలోచన లేకుండా మాట్లాడటం  సంస్కారం అనిపించుకుంటుందా అని నా ఆలోచన.


కామెంట్‌లు