కవి మిత్రుల హారాలు-2;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
గోపి ముత్యాల హారం
గణిత పై విహారం
చేసి లేపే దుమారం
ధూళి ఆయె నిస్సారం !

మొర్రి గోపి వ్రాసిన
ముత్యాల పేరులో
అతను చెప్పిన సత్యం
జరుగుతున్నది నిత్యం 

ఏకాంగుడు సర్వాంగుడు
సత్కారం నిర్వాహకుడు
సర్వంతర్యామి అతడు
మన అందరి రక్షకుడు !

రాజశేఖర్ యువకవి
ముత్యాల హారాల రవి
తాను వ్రాసినవే ఇవి
చక్కగాను అమరినవి !

కలాలు మీ చేత బట్టి
ముత్యాల హారాల ఉట్టి
పట్టుదలతో ఇక కొట్టి
ఉండాలి ప్రతిజ్ఞ బట్టి !

నా పుస్తకాన్ని చూసి
మెచ్చుకోలుగాను కూసి
అభినందన మాల వేసి
మీరైనారు సహవాసి !

ఉట్టి కొడుతాం అను మాట
విన్నాంలే మీ నోట
పట్టుబట్టి ప్రతిపూట
విప్పండి హారాల మూట !

నా పుస్తక పరిచయ సభ
సబికుల కన్నుల్లో ప్రభ
వెలిగేటి వెన్నెల శోభ
ఇక ఉండదు నాకు క్షోభ !

నా ముత్యాల హారాల
పైన మీ వేదిక కవుల
అల్లిన ప్రశంసల వల
స్థిరంగాను ఉండాల !

మీ శ్రావ్యమైన గొంతు
పాడిన కీర్తన తంతు
అసలు చేయకుండ రంతు
వినుటయే ఇక మా వంతు !

ముందు ముత్యాల హారాల
పొందుగా మూట కట్టాల
వచ్చి పోయేటి అతిథుల
ప్రశంసలను పొందాల!

మన విశ్వనాథం గారు
భౌతికంగా ఇక లేరు
భువిని విడిచివెళ్ళినారు
దీనికి వారు చేరినారు.!

కళాతపస్వి అయిన వారు
దర్శకుడై వెలిగినారు
రస సిద్ధిని పొందినారు
ఇక చిరంజీవి యైనారు !


కామెంట్‌లు