ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (20);- -ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322


 ఆ సమాధానం విని నాకెంతో సంతోషం కలిగింది. అయితే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి  నేను కట్నకనుకులకు వ్యతిరేకం నేను తీసుకోలేదు, నేను ఇవ్వను అమ్మాయి మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే వివాహం చేసుకోండి అని ఖచ్చితంగా చెప్పేసరికి  నేను ఆ ప్రస్తావన తీసుకువచ్చానా  నేను స్వయంకృషిని నమ్ముకున్నవాడిని ఉద్యోగ అర్హతల వల్ల నా ఆశయ సాధన కోసం వ్యవసాయాన్ని  సాధనంగా ఎంచుకున్నాను  అని చెప్పిన మాటలకు నేను ఎంతో ఆశ్చర్యపోయాను. నిండు మనసుతో అంగీకరించి నా సిద్ధాంతాలకు అనుగుణంగా నడిచే వ్యక్తి అల్లుడుగా దొరికాడని నేను, అరుణ ఎంతో మురిసిపోయాం  వివాహం అయిన తర్వాత సంవత్సరం వరకు  పండగలకు వారి  పుట్టిన రోజులకు వారిని పిలిచి కొత్త బట్టలు పెట్టే వాళ్ళం. తర్వాత సంవత్సరం నుంచి  అలాంటివి అంగీకరించను  మీరు నాకు ఏమీ పెట్ట వద్దు అని తానే మా పుట్టినరోజుకు మాకు బట్టలు తీసుకురావడం మొదలు పెట్టాడు. తను అనుకున్న ఆశయాలకు అనుగుణంగా జీవితాన్ని  గడపడానికి నడుము కట్టాడు. స్వయంకృషితో ఎవరి నుంచి ఏదీ ఆశించకుండా ఎవరిని యాచించకుండా జీవించాలని ఆయన జీవిత ధ్యేయం.  నాలాగే తనకు  సొంత అభిప్రాయాలు కలిగిన వ్యక్తి.  తన స్నేహితులలో ముగ్గురుని కలుపుకుని నెల్లూరుకి దగ్గరలో పనికిరాని పొలాన్ని కొని దాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనదే. నెల్లూరు వచ్చిన మొదటి సంవత్సరంలోనే  శ్రీ వంగడం అన్న కొత్త విధానాన్ని అక్కడ ప్రజలకు అలవాటు చేసి దాని వలన ఎంత దిగుబడి పెరుగుతుందో అందరికీ ప్రత్యక్షంగా చూపిన  కర్షకుడు. ఆ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కో జిల్లాకు ఒక్కొక్క ఉత్తమ రైతును ఎన్నిక చేసి వారికి బహుమతులు ఇవ్వాలని నిశ్చయించుకొని  నెల్లూరు జిల్లాకు ఆయన్ని ఉత్తమ రైతును చేశారు  కోటిరెడ్డి జీవితంలో ఇది మొదటి విజయం. నేను విజయవాడ నుంచి విశాఖపట్నం కేంద్రానికి బదిలీయై వెళ్ళిన సమయంలో  తాను విజయవాడకు వచ్చి మా ఇంటి వ్యవహారాలని చూసుకునేవాడు  ఆ సమయంలో లైన్స్ క్లబ్ లో ప్రముఖ పాత్ర వహించి ఒక సంవత్సరం  ప్రెసిడెంట్ గా కూడా ఎన్నికయ్యారు  ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి  విశాఖపట్నం నుంచి అప్పటి మేయర్ గా ఉన్న ఏవి సుబ్బారావు గారు కూడా హాజరై అభినందనలు 

తెలియజేశారు. అంతకుముందు ఏ ప్రెసిడెంట్  చేయని అనేక పనులను తన హయాంలో చేపట్టారు  అన్నిట్లోనూ ఘన విజయం సాధించాడు. కుటుంబాలతో వన భోజనాలు పెట్టడం దగ్గర నుంచి  పేదలకు వైద్య సహాయం  తనకు తెలిసిన  మా కుటుంబ సన్నిహితులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి డాక్టర్ సమరం మా అన్నయ్య గారి అబ్బాయి డాక్టర్ శ్రీధర్ రెడ్డి ల సహకారంతో ఎన్నో వైద్య శిబిరాలను నిర్వహించి పేదలకు ఉచితంగా మందులు కూడా ఇప్పించాడు.


కామెంట్‌లు