సామాన్యంగా రైతు కుటుంబాలకు గేదెలను, ఆవులను పెంచడం అలవాటు. కానీ గొర్రెల పెంపకంలో మంచి లాభాలు వస్తాయని తెలిసి వ్యాపార దృష్టతో అది ప్రారంభించడానికి ఆయత్త మైనప్పుడు కొంతమంది సన్నిహితులు అది గొల్లవారు చేసే పని మనం చేసేది కాదు దానిలో మనం విజయాన్ని సాధించలేం అని ఎన్ని రకాలుగా చెప్పినా తాను నమ్మిన దానిని దేనిని వదలని కార్యసాధకుడు. దీనిని ఎలా అభవృద్ధి చేయాలో నాకు తెలుసు అని గొర్రెలను కొని వాటి ద్వారా అభివృద్ధి పరిచాడు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు దూరదర్శన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అన్ని పార్టీల నాయకులను ప్రశ్నలు వేయడానికి ఎంపిక చేస్తే రెడ్డిగారు నెల్లూరు నుంచి ఉత్తమ రైతు కోటిరెడ్డిని పిలిపించండి అన్నారు నిర్వాహకులు అలాగేనని కోటిరెడ్డి గారిని కూడా పిలిచారు. చాలామంది పార్టీ నాయకులు పార్టీకి సంబంధించిన విషయాలు తప్ప వేరేవి అడగలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్రత్యక్ష ప్రసారంలో కోటిరెడ్డి వీళ్లంతా పార్టీ బలాన్ని పెంచుకోవడానికి ప్రశ్నలు అడుగుతున్నారు. రైతులకు సంబంధించిన విషయాలు నువ్వు ఏమైనా అడగలవా అని అనగానే లేచి సభా సదులకు నమస్కరించి రెడ్డిగారు ఒకే ఒక ప్రశ్న అడుగుతాను ప్రభుత్వం తరఫున వ్యవసాయ అధికారులను విలేజి లెవెల్ వర్కర్స్ ను ఏర్పాటు చేశారు వారికి జీతాలు ఇస్తున్నారు గ్రామానికి ఆయన వచ్చి ఏ రైతు నైనా పలకరించి మీరు ఎలా వ్యవసాయం చేస్తున్నారు ఇలా చేస్తే బాగుంటుంది కదా అని సలహా ఇచ్చిన ఒక్కరిని చూపించగలరా అంటే రెడ్డి గారు మీరు చెప్పిన ప్రశ్నలు పూర్తిగా అర్థం కాలేదు వివరంగా చెప్పండి అని అడిగారు. దానికి కోటిరెడ్డి సమాధానం చెబుతూ మీరు నియమించిన ఉద్యోగులు ఏ గ్రామానికి అయినా వెళ్లి ఆ గ్రామం చూడడం చేస్తున్నారు తప్ప పొలంలో ఏ పంట వేస్తున్నారు మీకు లాభదాయకంగా ఉండే పంట ఏమిటి అని ఒక రైతు నేనా ప్రశ్నించిన పాపాన పోయారా అని అనగానే దానికి పరిష్కారం కూడా మీరే చెప్పండి అని ముఖ్యమంత్రి అనగానే ఏ అధికారి ఏ గ్రామానికి వచ్చి నిజమైన వ్యవసాయదారులను ఒకచోట కూర్చోబెట్టి వారికి కావలసిన వనరులు ఏమిటి ప్రభుత్వం తరఫున ఏం చేయగలం మీ సేవకు రాజశేఖర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు నిర్మొహమాటంగా చెప్పండని అడిగితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి దానికి తగ్గట్టు మీ అధికారులకు కొంచెం ఇన్సెంటివ్ ఇస్తే వారు నిజాయితీగా, ఎక్కువగా పని చేస్తారు అని చెప్పాడు.
ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (21);- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి