ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (22);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322

 కోటిరెడ్డి అలా చెప్పగానే  రాజశేఖర్ రెడ్డి గారు ప్రక్కనే ఉన్న ఉన్నతాధికారిని పిలిచి కోటిరెడ్డి చెప్పిన ప్రతి అక్షరాన్ని తూచా తప్పకుండా చేసి తీరాలి  ఈ రోజు నుంచి కోటి రెడ్డి లాంటి ఉత్తమ రైతుల సహకారాన్ని  ప్రభుత్వం  తీసుకోవాలి  అందుకోసం ఆర్థికంగా కొంత సహకారాన్ని ప్రతి రైతుకు అందచేయాలి. 5 వేల రూపాయలు ప్రతి నెల ఇవ్వండి అని రెడ్డి గారు చెప్పి అంతటితో ఆగకుండా  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న  వారిని పిలిచి ఇలాంటివి చెప్పిస్తే ప్రయోజనం ఉంటుంది తప్ప  ఇలా నేను వచ్చాను కదా అని పార్టీ వాళ్ళని పిలిస్తే సమయాన్ని వృధా చేసిన వారు అవుతారు. మీరు ఎంపిక చేసే వారిని  మాట్లాడగలిగిన రైతులను ఎంపిక చేయండి  అని సలహా ఇచ్చి  రెడ్డి గారు వెళ్లేటప్పుడు  కోటి రెడ్డీ అప్పుడప్పుడు కలుస్తూ ఉండమని చెప్పి మరీ వెళ్లారు. ఆ తర్వాత కొన్ని నెలలకు  కేంద్ర ప్రభుత్వం శరత్ పవార్ అధ్యక్షతన రైతు సమావేశం ఏర్పాటు చేస్తే ఆంధ్ర రాష్ట్రం తరఫున రాజశేఖర్ రెడ్డి గారు  కోటిరెడ్డి ని పంపించారు. కోటిరెడ్డి ఆంగ్లంలోనూ, హిందీలోనూ మాట్లాడగలడు కనుక సూటిగా వివరించి చెప్పే అవకాశం వచ్చింది  ఆ సమయంలో వ్యవసాయ శాఖ తరపున ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ రాయితీ రావడానికి అవకాశం కలిగింది. ఆ సమావేశం వల్లనే  నేను అప్పుడప్పుడు నెల్లూరు వెళ్లి వస్తూ ఉంటాను అమ్మాయి దగ్గరికి  నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆదిత్య కళాశాలలో దాని  సంచాలకులు ఆదిత్య గారు  నాకు బాగా పరిచయమయ్యారు. వారికి సన్నిహితులు  బొగ్గరపు రాధాకృష్ణమూర్తి  కవి రచయిత ఉపాధ్యాయుడిగా  పదవీ విరమణ చేసినవాడు  రోజు సాయంత్రం కళాశాలలో కలుస్తూ ఉండేవాడు.
సాయంత్రం మేము కలిసిన సందర్భంలో మాతో పాటు కొంతమంది సాహితీ ప్రియులు  వచ్చి కూర్చుని ఆదిత్య గారితో కాలక్షేపం చేస్తూ ఉండేవారు  అనేక పర్యాయాలు అనేక విషయాల మీద  చర్చలు జరుపుకోవడం ఆ చర్చ  సారాంశాన్ని చివర ఆదిత్య గారు అందరికీ విశద పరచడం  పరిపాటి  వారికి నేను ముందే తెలుసు కనుక  ఆకాశవాణికి సంబంధించిన విషయాలను  సంస్కృతీ సంప్రదాయాలను గురించిన వాటి  మూలాలను చెప్పమని అడిగేవారు.  అలా అనేక విషయాలలో  సినిమాలు కానీ రాజకీయాలు కానీ  ఏవీ మాకు  అడ్డు వచ్చేవి కావు  ఎవరు దేనిని ప్రశ్నిస్తే దానికి సంబంధించిన సమాధానాలు  మిగిలిన వారు వారి అభిప్రాయాలను చెబుతూ ఉండేవారు  అలా నిత్యం కాలక్షేపం జరుగుతూ ఉండేది.

కామెంట్‌లు