సత్యనారాయణ గారికి తిక్కన గారి కవిత నచ్చినట్లే శ్రీరంగం శ్రీనివాసరావు అనబడే శ్రీశ్రీకి విశ్వనాధ వారి కవితలు అలవాటయింది. ఆయన మాటల్లో ఆయన చెప్పిన విషయం నేను విశ్వనాథ సత్యనారాయణ గారి కబంధహస్తాల నుంచి తప్పుకోవడానికి 12 సంవత్సరాలు వ్యయ ప్రయాసలు పడవలసి వచ్చినది అప్పటివరకు నా
గొంతు సత్యనారాయణ గారిది ప్రస్తుతం నా గొంతు వినిపిస్తున్నాను అన్నారు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి జాషువా గారిని అనుసరించి చెప్పే కవితలు ఎన్ని లేవు వారి శిష్యులు చాలామంది వారి బాణీలోనేగా వ్రాస్తూ ఉంది కనుక ఎవరి పైన అభిమానం ఎక్కువగా ఉంటుందో వారు వీరి మనసులో ముద్ర పడిపోతారు వారికి తెలియకుండానే ఆ పద్ధతులు అలవాటు అయిపోతాయి ఇది మానవాళికి సహజం.
సత్యనారాయణ గారు తన పుస్తకాలను అన్నిటిని క్వాలిటీ ప్రచురణ( మురళీ కృష్ణ) వారి ద్వారా ముద్రిస్తూ ఉంటారు ఆ ముద్రాపకుడు కూడా కవి కావడం వారు రాసిన పుస్తకాలకు ముందుమాట విశ్వనాథ వారు వ్రాయడం ఆనవాయితి. కొంతకాలానికి ఇప్పుడు వచ్చిన మురళీ కృష్ణ కుమారుడు కూడా ఒక నవల రాసి గురువుగారిని అభిప్రాయం వ్రాయమని కోరాడు ఆయన దగ్గర ఉన్న చొరవవల్ల కాదనలేకపోయారు దానిలో ఒక్క వాక్యం కూడా విశ్వనాథ వారిని ఆకట్టుకోలేదు కానీ ఎంత చండాలంగా రాశావు అని చెప్తే అతని మనసు బాధపడుతుంది కనక లౌక్యాన్ని ఉపయోగించి అతను రాసిన కథకు అభిప్రాయం రాయడానికి అంగీకరించి వ్రాయాలన్న తపన ఉంది తండ్రి లాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని కోరిక ఉంది దానిని ప్రచురించడానికి సొంత ముద్రణాలయం కూడా ఉంది కనుక ఆ ప్రయత్నం చేశాడని నేను అనుకుంటున్నాను వారి నాన్నగారు మంచి పండితులు భాషా జ్ఞానం కలవాడు శైలి మంచిది అని ముగించారు. తన తండ్రి పేరు కూడా రాయడం ఆయన మెచ్చుకోవడం వల్ల అతనికి ఎంతో ఆనందం కలిగింది కానీ దానిలో అంతరార్థం మాత్రం తెలియలేదు మనకు తెలుగులో పండిత పుత్ర పరమ శుంఠ అని ఒకనాడు సంస్కృతంలో ఉన్న ఆ మాటను ప్రయోగించకుండా రాసిన మాటకు అతను ఉబ్బి తబ్బిబై పోయాడు అలా తెలియకుండా చోరకలు పెట్టడం విశ్వనాథ వారి ప్రత్యేక శైలి ఆ రచయితకు అర్థం తెలియకపోయినా ఆ పుస్తకం చదివే ప్రతి చదువరికి అర్థమయిపోతుంది అలాంటివాడు రచనలు చేయడానికి ఎందుకు పనికిరాడు అన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పిన విషయం చదివిన ప్రతి పాఠకుడు సత్యనారాయణ గారి మేధస్సు ను సమయస్ఫూర్తిని మెచ్చుకునేవారే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి