కవి సమ్రాట్ -(6);- డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఎన్టీ రామారావు గారు  విద్యార్థి దశలో ఉన్నప్పుడే విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలను అన్నిటిని చదివారు  వారికి బాగా నచ్చిన నవల ఏకవీర  దానిలో ఇద్దరు స్నేహితుడు  ఇద్దరూ స్నేహితురాళ్లను ప్రేమిస్తారు.  పరిస్థితుల ప్రభావం వల్ల  ఒకరు ప్రేమించిన అమ్మాయిని మరొకరు వివాహం చేసుకుంటారు  దానిలో కథానాయకుడు  మధ్యలో తన స్నేహితుని ఇంటికి వచ్చి  అతని ఇల్లాలిని చూసి  ఎంతో మధనపడి  చివరకు తాను ప్రేమించిన అమ్మాయి ఈమె  అని చెప్పిన సంఘటన  రామారావు గారికి చాలా బాగా నచ్చింది. వారు సినీ రంగానికి వెళ్లి  మంచి పేరు తెచ్చుకున్న తర్వాత  నిర్మాతలతో ఈ సినిమా  మనకు చాలా  పనికి వస్తుంది  మంచి రచయితను చూసి  సంభాషణలను వ్రాయించండి  గురువుగారి దగ్గర నేను  అనుమతి తీసుకుంటాను అని చెప్పాడు.
కథానాయకుడు చెప్పిన తర్వాత కాదనేది ఏముంటుంది  చక చక కథ తయారయింది  స్క్రీన్ ప్లే మొత్తం  రామారావు గారికి చూపించి వారి ఆమోదంతో  అతని స్నేహితుని పాత్రను  కాంతారావు గారికి  పిచ్చి సినిమా ప్రారంభించారు  ఆ సినిమా పూర్తయి ఆంధ్రుల మనసులో స్థిరస్థాయిగా నిలిచింది.  కథాగమనం కానీ  దర్శకుని ప్రతిభ వల్ల కానీ  మంచి విజయాన్ని సాధించిన ఆ చిత్రం  విశ్వనాథ వారు కూడా ఆ సినిమాను చూసి ఎంతో ఆనందించారు  శిష్యుణ్ణి అభినందించారు  అయితే సినీ రంగంలో తన  కథలు సినిమా కోసం ఇవ్వాలని ఒక సందర్భంలో ఆయన  ప్రయత్నం చేసి  విజయాన్ని సాధించలేక  తిరిగి తన సాహితీ ప్రపంచంలో పోయారు. అలాంటిది రామారావు గారు  విజయాన్ని పొందటం తనకెంతో ఆనందంగా ఉందని  మనవి చేశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు మురళీకృష్ణ  క్వాలిటీ బుక్ పబ్లిష  కుమారుడ్ని ఎలా 
 నిందించారో  ప్రతి పండితుని యొక్క పుత్రుని  వేద విదులు అలాగే చెప్పారు. దానికి ప్రత్యక్ష ప్రమాణం విశ్వనాథ వారే.  జగద్విఖ్యాతిగాంచిన మహానుభావుడు  సాహిత్యం లో ప్రతి అక్షరాన్ని వ్యాఖ్యానించ గలిగిన ప్రతిభ కలిగిన వాడు  ఏ చర్చలోనైనా తార్కికంగా వాదించి  అవతలి వారిని నొప్పించకుండా ఒప్పించే  నేర్పరి  అలాంటివాడు తన కుమారుని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు  అయితే దానికి కారణం ఆయన నమ్మిన సిద్ధాంతం  ఎవరికి ఏ విధమైన  విద్య అలవాడినా  అది సంచిత జన్మ ప్రభావం తప్ప  ప్రస్తుత జీవితంలో మనం నేర్చుకునేది కాదు  కనుక ఎవరి తెలివి వారిది  అని ఎలా ప్రవర్తించేవారు.


కామెంట్‌లు