మన గురువు ప్రకృతి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈ ప్రపంచంలో ప్రకృతి ఏ జీవిని  ఊరికే సృష్టించలేదు. దేని ప్రయోజనం దానికి ఉంది  చాలామంది  సాక్షాత్తు శంకరుని శంకించి సగం ఆడా సగం మగా ఉండే సృష్టి ఈ ప్రపంచంలో ఉంటుందా అని ప్రశ్నించేవారు చాలా మంది ఉన్నారు. మనం దేనిని  లోతుగా ఆలోచించకుండా  మాట్లాడడం అలవాటు చేసుకున్నాం దేనినైనా మనం విమర్శించాలనుకున్నప్పుడు  నిశిత పరిశీలన అవసరం  ఆ జ్ఞానం లేకుండా  నోటికి ఏది తోస్తే అది చెప్పడం అనేది  సహజ ప్రవృత్తిగా మారింది  ఈ భూమి మీద ప్రజలకు కంటికి కనిపించని ఏకైక వస్తువు అమీబా ఏకకణ జీవి  దానికి స్త్రీ పురుష భేదం లేదు  దానిని సగం చేసుకుని  సంతాన ఉత్పత్తిని కలగ చేస్తుంది. ఇది ప్రతి శాస్త్రజ్ఞునికి తెలిసిన విషయం  అది తెలిస్తే సాక్షాత్తు పరమేశ్వరుని గురించి ఎవరైనా అలా మాట్లాడగలరా?  మనం మాట్లాడే ముందు ఆలోచించాలి  మన ఆలోచన సరైనది అని తెలుసుకున్నప్పుడు మాత్రమే దానిని బయటపెట్టాలి  ఇది కనీస మర్యాద. వేదకాల నుంచి  మన పెద్దలు మీరు ఏ కార్యక్రమం ప్రారంభించడానికి ఉపక్రమించిన  ముందుకు తల్లి  తరువాత తండ్రిని  ఆ తర్వాత గురువును  జ్ఞాపకం చేసుకుని వారికి నమస్సులు అందించి ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని చేయమని చెప్తారు  పెద్దవాడు చెప్పింది వింటాం దానిని చదువుతాం కానీ ఆచరణలో మాత్రం  చూపడానికి ముందుకు రాము ఆ విషయాన్ని చెప్పడానికి ప్రత్యక్షంగా ఉదాహరణ కోసం  సాక్షాత్తు రాష్ట్రపతి పదవిలో ఉన్న  అబుల్ కలాం గారు  పళ్ళు  ఫలాలు పంచల చాపు తీసుకొని గురువుగారి ఇంటికి వెళ్లి  వారి తలుపు తట్టి వారు తలుపు తీయగానే వారి చేతిలో పంచల చాపు పెట్టి  నేలపై సాష్టాంగ ప్రమాణం చేసిన ఆదర్శ జీవి. గురూజీ నేను ఈ రోజు డాక్టరేట్ తీసుకోబోతున్నాను.  మీరు చెప్పిన అక్షర సముదాయం  నాకు ఈ గౌరవాన్ని దక్కించింది కనుక ఆ గౌరవం మీదే. మీ సమక్షంలో ఆ బహుమతిని తీసుకోవాలని  అనుకుంటున్నాను మీరు వస్తే తప్ప నేను ఆ కార్యక్రమానికి వెళ్ళను అని చెప్పిన తర్వాత
వీరి ఆహ్వానాన్ని ఆవృద్ధ  గురువుగారు ఆమో దించి  సన్మానం జరిగే ప్రాంగణంలో  అడుగుపెట్టగానే  అబుల్ కలాం గారు  వేగంగా వెళ్లి వారి  పాదపద్మాలకు సాష్టాంగా నమస్కారం చేసి లోపలకు తీసుకువచ్చి ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టి  వీరు నాకు అక్షరాలు నేర్పిన గురువుగారు  నేను ఈరోజు ఈ సన్మానాన్ని స్వీకరిస్తున్నాను అంటే దానికి కారణం  వారు నేర్పిన అక్షర జ్ఞానం  నాకు అక్షరాలనే కాదు  జీవిత నడతను కూడా నేర్పిన మహనీయులు  మీరిచ్చే ఆ  బహుమానాన్ని వారి చేతుల మీదుగా నేను సేకరిస్తే నా జీవితం ధన్యమవుతుంది  అని ఎంతో వినయంగా  పార్లమెంట్ సభ్యులకు నిర్ణయాన్ని చెప్పిన తర్వాత  ప్రతి ఒక్కరూ అధ్ర నయనాలతో  కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు   ఇది ప్రతివారికి ఒక పాఠం.



కామెంట్‌లు