కవి సమ్రాట్ (8); - డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 సనాతన ధర్మాన్ని  మనసా వాచా కర్మణా ఆచరించే విశ్వనాథ వారు  ఎప్పుడు ఎక్కడ మత ప్రచారం చేయలేదు  పరమతస్తులంతా ఈ మతంలో చేరండి అన్న మాట ఆయన నోటి నుంచి రాలేదు. ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి  అని నమ్మేవారు  శ్రీశ్రీ  వామపక్ష పాతి ఏ అన్యాయం ఎక్కడ ఎలా జరిగిన దానిని చూస్తే ఆ క్షణంలోనే చక్కటి కవిత అల్లేవారు. అలాగే త్రిపురనేని రామ స్వామి చౌదరి గారు ఆయన హేతువాది కార్యకారణ సమన్వయం లేకుండా ఏ విషయము ఉండదు అని ప్రచారం చేస్తున్నవారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకం ప్రత్యేకించి వివాహాల గురించి  బ్రహ్మ ద్వేషం ప్రారంభమైంది  బ్రాహ్మణుల పైన కాదు  ఒక పురోహితుడు వచ్చి వివాహం జరిపిస్తూ అనేక శ్లోకాలు చెప్తూ ఉంటాడు  మధ్యలో కొన్ని  మంత్రాలు చదువుతూ ఉంటాడు  నూతన వధూవరులను మమ మమ అనుకోమంటాడు.
వారు చెప్పే ఏ ఒక్క వాక్యమైనా  అర్థమవుతుందా  ఆ నూతన దంపతులకు.  ఎవరికోసం ఆ మంత్రాలు  అన్న విషయాన్ని గురించి వారికి కోపం ఆ మంత్రంలో లేదా శ్లోకంలో ఏ చక్కటి  వీరి జీవితానికి సంబంధించిన అనుసరించదగిన  విషయాలు ఉన్నాయో  వాటిని వారికి అర్థమయ్యే భాషలో చెబితే  వారు అవి చేయడానికి ఆస్కారం ఉంటుంది  ధర్మేచ  అన్న శ్లోకం ఎంతమందికి అర్థమవుతుంది. చదువుకున్న వారు కూడా  ధర్మము కామము అర్థము మోక్షము అనే నాలుగు పేర్లు చెబుతారు తప్ప ధర్మమార్గములో కామమును తీర్చుకొనుము  మీ భార్యను తప్ప మరొక స్త్రీని  కోరుకోవద్దు  ధర్మ మార్గములో అర్థమును  సంపాదించు ఏ దొడ్డి దోవలు వద్దు ఎవరినీ బాధించి పీడించి సంపాదించడం తగదు. అలాగే మోక్ష మార్గాన్ని కూడా ధర్మ పద్ధతిలోనే సాధించాలి  అని వారికి అర్థమయ్యే పద్ధతులలో చెబితే  వారిని వాటిలో కొంతవరకైనా ఆచరించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల సమాజానికి శ్రేయస్సు పెరుగుతుంది  అన్న అభిప్రాయంతో వివాహ విధి అన్న పేరుతో చిన్న పుస్తకాన్ని వ్రాసి  కొన్ని వందల వివాహాలను  ఆయన పురోహితుడిగా ఉండి వారికి అర్థమయ్యే పరిభాషలో ప్రతి అక్షరాన్ని చెప్పి చేసిన ఆదర్శ జీవి. అలాంటి మహానుభావుడు భగవద్గీతను గురించి రాశారు. భగవద్గీత ఎంతమందికి అర్ధమవుతుంది  పండితులకు కూడా అర్థం కాని  పద్ధతులు దానిలో ఉన్నాయి  మరి దాని వల్ల ప్రయోజనం ఏమిటి  వారి కర్తవ్యం భావం తెలియడం కోసం చేసిన పుస్తకం  వారికోసం కాకుండా మీ పాండితీ ప్రకర్ష కోసం  పాండిత్య ప్రదర్శన కోసం  రాయడం సమంజసమా అని ఆలోచించి తన పద్ధతిలో పుస్తకాన్ని వ్రాశారు.



కామెంట్‌లు