భాష బతకాలి!;-డా.పి.వి.ఎల్. సుబ్బారావు విజయనగరం, 9441058797.
 ఫిబ్రవరి 21 ,
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ,
శుభాకాంక్షలతో,
=============================
1. శ్వాసిస్తే మనిషికి జీవము! 
    భాషిస్తేనే భాష రాజీవము !
  అన్ని జాతులు ,అన్ని దేశాలు!
 
 వెరసి విశ్వం,మనుగడ ఊపిరి! 
మాతృభాషతోనే నిలుచు మరి!
2.మాతృభాష అనన్య పటిమ! 
   
   జీవన స్థిరత్వ నవ్య గరిమ!
   
   ఏమా అనంత మహిమ?
    
   ఆదిశేషునికైనా,
                వర్ణించ తరమా!
   
   భాష లేకుంటే,
            అసలు మనగలమా!
3. ఇల అమ్మ పాలు అమృతం! 
నేర్వ అమ్మ భాష అనాయాసం!
మానవజన్మకి అద్భుతవరాలు! 
ఒకటి సుధృఢ దేహపుష్టి !
మరొకటి సకల విద్యాసృష్టి!
4. అమ్మపాలు తాగని వాడు!  
   
    అమ్మభాష పలకని వాడు!
   
   అమ్మదేశం విడిచిన వాడు!  
   
   జీవన తిరస్కృతుడే కాదు! 
    
  వాస్తవానికి జీవన్మృతుడే!
5.మాతృమూర్తుల్లారా వినండి!
  
  శిశువులకు పాలిచ్చిపెంచండి!
 
మాతృత్వం సార్ధకంచేసుకోండి!     
 మీభాష మురిపాలముంచండి! 
  మాతృభాషతో,
              బతకాలని చెప్పండి
6. భాష మృతమైతే ,
              బ్రతుకు అనృతం !
    
   భాష జాగృతమైతే ,
               బతుకు అమృతం!
 
    అందుకే మనం భాషను,
                    బతికించాలి !
   భాష బతుకు కోసమే ,
             మనం జీవించాలి!
  జీవిత పరమార్ధం భాషే,
           అని గ్రహించాలి!
_________


కామెంట్‌లు
BSN Murty చెప్పారు…
చాలా బాగుంది sir...