అన్న సోమన్న గద్వాల
కలం రాసిన మధురిమల
అందించే పుస్తకాల
చదివి ఆనందించాల!
మన సోదరుడు సోమన్న
పుస్తక ప్రియుడే నన్న
విషయం తెలుసుకున్న
వారు గౌరవిస్తారన్న !
మన సోమన్న సోదరుడు
బాలల సాహిత్య ఘనుడు
తను కవులలో ప్రముఖుడు
పలు పొత్తముల పురుగతడు !
మన గద్వాల సోమన్న
బాల గేయాలు ఉన్న
పాలపుంత పొత్తమన్న
భలేగా ఉందిరన్న !
కవయిత్రి జ్యోతి వైద్య
హారాలు తో సయోధ్య
సాధన కాదులే మిధ్య
ఉన్నది ఆమె మన మధ్య !
మన జ్యోతి వైద్య గారు
మూడు వందలు వ్రాసారు
హారాల పేరు అల్లారు
అందులో ఎదుగుతున్నారు !
మూడు వందల హారాల
మేడం జ్యోతి వైద్యుల
అల్లిన అందాల మాల
గుభాలించు సుగంధాల !
జ్యోతి ముత్యాల హారాలు
మెరిసేటి తారకమణులు
కురిసేటి వరుణ ధారలు
పండేటి పాడిపంటలు !
కవయిత్రి శ్రీమతి జ్యోతి
హారాలు అల్లే భారతి
పొందేను అపరఖ్యాతి
ఆమెకు ఇవ్వాలి బహుమతి !
జ్యోతి వైద్య సోదరి
అల్లిన హారం శ్రీహరి
నామంపై ఆమె గురి
పొందెను ముక్తి మరి !
జ్యోతి వైద్య సంక్రాంతి
ముత్యాల హారాల ఖ్యాతి
హిమ శిఖరాగ్ర ఉన్నతి
కి ఇస్తున్నాం మా హారతి!
కవి మిత్రులు రారండి
వేదికను ఇక ఎక్కండి
హారాలను మరి అల్లండి
ముత్యాలను కురిపించండి !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి