సామాన్యుడి జీవితం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 సామాన్యంగా ప్రతి పల్లెలోను  ధనవంతులు సామాన్యుడు  స్వయంకృషితో జీవించేవారు  మూడు రకాల వారు ఉంటారు  వీరిలో ధనవంతులు తక్కువ  అందరిలోకి సామాన్యులు ఎక్కువ కూలీనాలీ చేసుకుంటున్న వాళ్లు  కొద్దిమంది ఉంటారు  దాదాపుగా ఏ పల్లెటూరులో చూసిన అందరూ ఒక కుటుంబ సభ్యులగానే ఉంటారు. అందరూ అన్నా అక్క లాగా వరుసలతో పిలుచుకుంటారు తప్ప పేరు పెట్టి ఎవరూ పిలుచుకోరు  అంతచొరవగా  ఉంటారు అక్కడి ప్రజలు  ఏదో అతి తక్కువ మందిలో తప్ప ప్రతి వారిలో సహోదరులు తప్ప  అందరినీ సమానంగా చూస్తున్న వారే మనకు కనిపిస్తూ ఉంటారు. అందరూ అందరికీ తెలిసే ఉంటారు. గ్రామంలో  అలాంటి గ్రామాలలో అప్పుడప్పుడు  వర్షాభావం వల్ల  అధిక వర్షాలు రావడం వల్ల  పంటలు పాడవుతుంటాయి.
పంటలు లేకపోయినప్పుడు  దిగువ స్థాయి వ్యక్తులు  పనిచేయడానికి ఎవరు పిలవకుండా ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని  మరొక గ్రామానికి  వలస వెళ్లడానికి ప్రయత్నం చేస్తారు. అందరికీ ఆ విషయం చెప్పి ఏవైనా లావాదేవీలు ఉంటే అవన్నీ పూర్తి చేసుకుని ఏ గ్రామం సుభిక్షంగా ఉందో  ఆ గ్రామానికి వెళ్లి జీవితాన్ని కొనసాగిస్తారు అక్కడ అందరూ కొత్త ఎవరు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో తెలియదు  అక్కడ పద్ధతులు ఎలా ఉంటాయో వీరికి అన్నీ కొత్త కొన్ని రోజులు వారికి  ఆ గ్రామ ప్రజలను  కలిసి ఎవరెవరు ఎలా సహకరించగలరు  అన్నది ఆలోచించి ఎవరి వల్ల ఆ ధనికులు వీరికి పని ఇవ్వడానికి అంగీకరిస్తారు  అన్న విషయాలను ఆలోచించి వారి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు. వేమన ఎంతో అనుభవం ఉన్న వాడు కనుక  ఈ వలస జీవులను  కొంగలతో పోలుస్తూ ఆటవెలది  పద్యాన్ని మనకు అందించారు  కొంగ అంటేనే  దొంగ జపం చేస్తున్నట్లుగా  నటించి ఎప్పుడు చేప వస్తే దానిని పట్టుకొని తినడం దాని పని  అమాయకంగా ఇది కళ్ళు మూసుకున్నది అని భ్రమతో  ఆ చేపలు వస్తాయి. వీటికి ఆహారం అవుతాయి  ఆ చెరువులో నీరు పుష్కలంగా ఉండి  విపరీతమైన చేపలు ఉన్న  ప్రాంతాన్ని ఎన్నిక చేసుకొని  కొంగ తన కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా వలస జీవి లాగా ఆ చెరువు ఎండిపోయి  చేపలు లేకుండా పోయిన సమయంలో ఆ చెరువును వదిలి మరొక చెరువులోకి వెళ్లి  అక్కడ జీవించడానికి ప్రయత్నం చేస్తోంది.  వేమన పోలికలు ఎంతో సహజంగా  అందంగా ఉంటాయి  ఆ పద్యాన్ని చదవండి.

"తావసించు చోట తగ నల్జ డాయేనా  సౌఖ్యభూమికపుడు జరుగ వలయు  
కొలకు  లింకెనేని  కొంగలందుండునా..."


కామెంట్‌లు