పాలు- నీరు;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 పాల వ్యాపారం చేస్తున్న వారిని చూస్తే  మనకు చాలా చిన్న చూపు  ఏమయ్యా నీవు పాలమ్ముతున్నావా? నీళ్లు అమ్ముతున్నావా? అని ఏద్దేవా చేస్తున్న వారు కూడా ఉన్నారు  కారణం అతను నీళ్ళు కలుపకుండా అమ్మడు. కనుక  ఇక్కడ నీటికి పాలకు ఎంత దగ్గర సంబంధం ఉందో, స్నేహం ఉందో మనకు తెలియాలంటే  పాలలో నీళ్లు కలిపి చూడండి  అదే రంగు అదే రుచి  ఇది నీరు అని చెప్పడానికి వీలు లేనంతగా కలిసిపోతుంది. దానిని పాత్రలో పోసి వేడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ పాలు పొంగుతూ దానిలో ఉన్న నీరు ఆవిరిగా ఇంకిపోతూ ఉంటుంది. అప్పుడు తెలివైన గృహిణి ఏం చేస్తుందో తెలుసునా చేతిలో కొంచెం నీళ్ళు తీసుకొని దానిపై చల్లుతుంది వెళ్ళిపోతున్న స్నేహితుడు తిరిగి వచ్చాడు అన్న ఆనందంలో తిరిగి పాత స్థితికి వస్తుంది పాలు
సమాజంలో ఉన్న  రెండు రకాల వ్యక్తులను  ఒకరు  మంచిని నమ్మి దానిని అనుసరిస్తూ జీవిస్తూ  ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే మూర్ఘమతులైన  వారు కొందరు ఎలాంటి ఆశయాలు లేకుండా  స్వేచ్ఛకు స్వాతంత్ర్యానికి అర్థం కూడా తెలియని  స్థితిలో తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు అలాంటి మూర్ఖుడు సజ్జనుని యొక్క ప్రవర్తన చూసి  మనం కూడా అలా ఉంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో బుద్ధిమంతులతో చేరి కాలక్షేపం చేస్తూ ఉన్న  కొద్ది రోజులలోనే తన ప్రవర్తనలో వచ్చిన మార్పు గమనించగలరు ఇంత క్రూర మనస్తత్వం ఎలా మారిందా  అని ఆశ్చర్యానికి కూడా  మనం లోనవుతాము. కనక పెద్దల సుద్దిని వింటే బాగుపడతాడు లేకుంటే వాడంతే అంటారు పెద్దలు కూడా. ఈ సజ్జనుల సాంగత్యం వల్ల  దుర్జనులు  జీవిత పరమార్ధాన్ని గురించి తెలుసుకుంటారు  తాను ఎలాంటి పనులు చేయాలి  నలుగురు మెచ్చుకోవడానికి కాకపోయినా  తనకైనా నచ్చాలి కదా  ఆ పద్ధతులను ఎప్పుడైతే అతను  బుద్ధిమంతుల నుంచి నేర్చుకోవడం ప్రారంభిస్తాడో అప్పుడు ఇహ పర లోక భేదాలు తెలిసి వస్తాయి  జీవితంలో ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోవలసినదే  దానికి నిర్ణీతమైన సమయం ఉండదు  అయితే ఆ మోక్ష సాధన కోసం చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని బుద్ధిమంతుడు మాత్రమే వీరికి తెలియజేయగలరు  కనుక అలాంటి సజ్జనులతో సహవాసం చేసిన  ప్రతి వ్యక్తి తప్పకుండా మోక్షానికి అర్హుడు అవుతాడు కనుక అతనిని వదలవద్దు అని చెబుతున్నాడు వేమన  ఆ పద్యాన్ని ఒక్కసారి చదవండి.

"పాల గలయు నీరు పాలెయై రాజిల్లు నదియు సాంబయోగ్యమైన యట్లు  సాధు సజ్జనముల సాంగత్యముల చేత  మూఢజనుడు ముక్తిమొనయు వేమ..."


కామెంట్‌లు