కపట మాటలు;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 జీవితంలో ఏ మనిషికైనా  తాను చేయదలచుకున్న పనికి  తగిన సామర్థ్యం ఉన్నదో లేదో తెలుసుకొని దానిని ప్రారంభించాలి  నేను చాలా బాగా మాట్లాడగలను అన్ని విషయాలను చెప్పగలను  నన్ను ఉపాధ్యాయుని చేయండి అంటే  ఎలాంటి అర్హతలు లేకుండా అతనికి ఎలా  ఇస్తారా ఉద్యోగం  అలాగే వేదాంత సారాన్ని చెప్పగలిగిన వాడికి ఆధ్యాత్మిక చింతన ఉండాలి భగవత్ స్వరూపం తెలిసి ఉండాలి  అవేమీ తెలియకుండా గడ్డాలు మీసాలు పెంచి  నేను మీకు ఏదైనా చెప్పగలను మోక్షాన్ని ప్రసాదించగలను అని సాదాసీదా కబుర్లు చెబితే  అది వినేవాళ్లు విని పాటించే వాళ్ళు ఎవరైనా ఉంటారా  ఒక బాలుడిని విద్యాలయాలలో చేర్చాలంటే  అక్కడ చదువు ఎలా చెబుతారు కుర్రవాడు బాగా చదువుకునే ఏర్పాట్లు ఉన్నాయా  అని ఆలోచించకుండా. ఏ తండ్రి అయినా తన కుమారుడిని అక్కడ చేరుస్తాడా  బాగా చెప్పగలిగిన  అనుభవం కలిగిన ఉపాధ్యాయుడు ఉన్న  విద్యాలయాలను ఎన్నుకుంటాడు తప్ప  కబుర్లు చెబుతూ కాలక్షేపం వారి మాటలు నమ్మరు కదా  అలాగే దొంగ సాధువులు  పొట్టకూటి కోసం చేసే  ప్రయత్నాలు నమ్మి  అతనిని మించిన వేదాంత  శిరోమణి మరొకరు లేరు అని నమ్మి ఆతిని వద్దకు వెళితే  ఇతని పరిస్థితి ఏమిటి? ఇతను కూడా అతనిలాగే బజారున పడి యాచించవలసిన స్థితి వస్తుంది  ఇవాళ సమాజంలో మనం చూస్తున్న పరిస్థితులను ఆ కాలంలోనే వేమన పరిశీలించి  చెప్పడం  ఆయన మేధస్సుకు  నమస్కరించి తీరవలసినదే  అభిరామునితో తనకున్న అతి సన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని  ఈ విషయం  చెప్పాడు అనిపిస్తుంది.గొప్పలు చెప్పుకున్నంత మాత్రం చేత  అతను ఆశించిన  పెద్ద పదవి  దొరికితే అతను ఏం చేయగలరు  ఉన్న వ్యవస్థను వినాశనం చేయడం తప్ప. మాటలతో కడుపు నింపుకునే వారు అని మన పెద్దలు  ఊరికే చెప్పలేదు  ఏ నా నుడిని  కూడా  ఎవరు అనుభవం లేకుండా చెప్పరు  అనుభవం లేకుండా చెప్పిన ఏ మాట  ప్రయోజనం లేనిదే  కనుక అలాంటి వాడిని నమ్మకుండా  మీ ఆలోచనతో మీరు మోక్షాన్ని  సంపాదించుకోదలిస్తే  ఆ మోక్షం పైనే దృష్టి కేంద్రీకరించి  దివారాత్రులలో  తదేక దీక్షతో చేస్తే  తప్పకుండా మోక్ష వస్తుంది తప్ప  ఇలాంటి మోసగాళ్ల చేతిలో  చిక్కి జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పడం కోసం ఈ పద్యాన్ని మనకు  అందించాడు వేమన  ఆ పద్యాన్ని మీరు కూడా చదవండి.

"దొంగ మాటలాడక దొరుకునా మోక్షంబు  
చేతగాని కూత చెల్లడెపుడు  గురువు పద్దుగాదు  గుణహీనమదిగాక..."


కామెంట్‌లు