సామాన్యంగా చాలామంది యవ్వనంలో ఉన్న పిల్లలను చూస్తూ ఉంటే ఆశ్చర్యమేస్తుంది. ఇవాళ సమాజంలో ఎంతో అందంగా కనిపించాలని ఎదుటివారిని మించిన అందులో రాణించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సహజంగానే ఏ బాలికైన వయసు రాగానే తనకు తెలియకుండానే శరీర ఆకృతిలో మార్పులు వస్తాయి. దానికి తగిన పట్టుత్వం కలిపి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. ప్రకృతి శాస్త్ర ప్రకారం అందం మగవారి సొత్తు మనుషులను చూడండి మృగాలను చూడండి పశుపక్ష్యాధులను పరిశీలించండి. మనం రోజు చూసే కోడి ఎలా ఉంటుంది దాని నడక చూడాలనిపిస్తుంది పెట్ట ప్రక్కన పుంజు ఉండి ఆ రెండు ఆడుకుంటూ ఉంటే ఏది చూడడానికి అందంగా ఉంటుంది పుంజే కదా. నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంటే ఎంత అందంగా ఉంటుంది ఆ పురి విప్పేది మగ నెమలి అది నాట్యం చేస్తూ ఉంటే ఆడ నెమలి దాని పొట్టలో దూరి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. పింఛము లేని ఆడ నెమలి ఆనందమయంగా నాట్యం చేయగలదా మగ నెమలి ఏది అందంగా ఉంటుంది. కనుక ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతి పుంలింగము అందమే ప్రతి స్త్రీ ఆకర్షణీయమే అది వారికి ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చినది కావాలని తెచ్చిపెట్టుకొని ఎన్ని హంగులు సృష్టించినా దాని అసలు స్వరూపం రాదు కనక స్త్రీలు మేమంతా అందంగా ఉన్నావని మురిసిపోయేవారు దానికి కారణాలు తెలుసుకొని దానిని సృష్టించిన ప్రకృతిని అర్థం చేసుకుంటే తమ తణుకు బెలుకులకు మూలం తెలుస్తుంది. ప్రకృతి ప్రసాదించిన వరం తప్ప స్వతహ సిద్ధంగా నీకు ఉన్నది కాదు అన్న విషయం తెలిస్తే జీవితంలో ఏది స్థిరమూ ఏది అస్థిరము తెలుస్తుంది. ఇంత అందంగా ఉన్నా వయస్సు 10 సంవత్సరాల తర్వాత శరీరంలో పటుత్వం తగ్గి శరీరం ముడతలు పడి చూడడానికి వికారంగా ఉన్న ఆకారాన్ని చూసుకుంటే ఆ మిడిసిపాటు ఏమవుతుంది కనుక ప్రకృతి ప్రసాదించిన ప్రతి దానిని కాపాడుకుంటూ ఉండాలి తప్ప అది మన సొంతం అని విర్రవీగకూడదు. ఆ వరాల నిచ్చిన భగవంతునికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉండాలి తప్ప తన ప్రతిభ అని మురిసిపోకూడదు సహజంగా మానవుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే వ్యక్తి వేమన గనుక అంత నిర్భయంగా చెప్పగలిగాడు. ఆ ఆటవెలది చదివితే ఆ ఆటవెలది సొగసు తెలుస్తుంది.
"వెలది చక్కదనము వెరవైన యిడును
విపుని కరుణ లేక వితగనుండు
నీదు కరుణ చేత నేర్పులు కొరగావు..."
"వెలది చక్కదనము వెరవైన యిడును
విపుని కరుణ లేక వితగనుండు
నీదు కరుణ చేత నేర్పులు కొరగావు..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి