న్యాయాలు -57
గృహ బద్ధ కుమారీ/ ఘృత్ కుమారి న్యాయము
*****
గృహ బద్ధ కుమారీ అంటే కలబంద.దీనినే సంస్కృతంలో ఘృత్ కుమారి,ఆంగ్లంలో అలోవెరా అని అంటారు.
చాలా మంది ఇంటి లోపల చూరుకు గానీ, కొక్కానికి గానీ కలబందను వేళ్ళాడదీస్తూ ఉంటారు.
కానీ అది పెరగనూ పెరగదు.అలాగని చచ్చిపోనూ పోదు.చావడానికీ బతకడానికి మధ్య, అలాగే ఆకాశానికి భూమికి మధ్య త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా ఉంటుంది.
అలా చావనూ లేని ఆనందంగా బతకనూ లేని వ్యక్తుల స్థితిని ఉద్దేశించి,ఎటూ తేల్చుకోలేని అనిశ్ఛిత పరిస్థితి గురించి ఈ గృహ బద్ధ కుమారీ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
త్రిశంకు స్వర్గం అన్న మాట నిత్య జీవితంలో బాగా వాడే మాట. ఇది భాగవత, పురాణాల్లోనిది . దీనిని విశ్వామిత్రుడు సృష్టించాడని అందరికీ తెలిసిందే. మరి ఎందువలన సృష్టించ వలసి వచ్చిందో చూద్దాం.
ఇక్ష్వాకు వంశానికి చెందిన వాడు త్రిశంకుడు.త్రిశంకుని అసలు పేరు సత్యవ్రతుడు సూర్యారణ్యుని కొడుకు.హరిశ్చంద్రునికి తండ్రి. ఇతడికి బొందితో అంటే సశరీరంగా స్వర్గానికి పోవాలని కోరిక కలిగింది.ఆ కోరికను తమ కుల గురువు అయిన వశిష్టునికి చెబుతాడు. వశిష్టుడు అది అసంభవం,లోక విరుద్ధం అంటాడు.అయినా కోరిక చావని సత్యవ్రతుడు వశిష్టుడి యొక్క వంద మంది కుమారులను తన కోరిక నెరవేర్చమని కోరుతాడు.వాళ్ళు కూడా అసంభవం అని చెబుతారు.దానితో వాళ్ళ తపోశక్తిని అవమానిస్తాడు.వాళ్ళు ఆ కోపంతో రాజును శపిస్తారు .
అలా శపించబడిన సత్యవ్రతుడు త్రిశంకుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం.
గురువాజ్ఞ ఉల్లంఘన, వశిష్ట కుమారుల శాపంతో వచ్చిన ఛండాలత్వం.ఛండాలత్వంలో చేసిన నిషిద్ధ వస్తు భోజనం...ఈ మూడు దోషాలతో సత్యవ్రతుడు త్రిశంకుడు అయ్యాడు. శంకువు అంటే దోషం అని అర్థం. మూడు దోషాలు చేసిన వాడు కాబట్టి సత్యవ్రతుడు త్రిశంకుడుగా పిలవబడ్డాడు.
వశిష్ట మహర్షి నిరాకరణ, అతని కుమారులు పెట్టిన శాపం ,తన కోరిక గురించి విశ్వామిత్రుడికి చెబుతాడు. వసిష్ఠుడికి సాధ్యం కాని పని తాను చేస్తాననీ త్రిశంకుడి కోరిక నెరవేరుస్తానని చెప్పి బొందితో అంటే సశరీరంగా స్వర్గానికి పంపిస్తాడు.
కానీ స్వర్గాన్ని పాలించే ఇంద్రుడు త్రిశంకుడిని స్వర్గానికి రానివ్వడు.గురువు పుత్రుల శాపం పొందిన అతనికి స్వర్గలోక ప్రవేశం లేదని, వచ్చిన దారినే వెళ్ళిపొమ్మని అక్కడ నుండి కిందకు నెట్టేస్తాడు.అలా నెట్టడంతో తలక్రిందులైన త్రిశంకుడు విశ్వామిత్రుని ప్రార్థిస్తాడు.
అప్పుడు విశ్వామిత్రుడు తనకే అవమానం జరిగిందనే కోపంతో బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి అంటే స్వర్గాన్ని , నక్షత్ర మండలాన్ని సృష్టించ బోతాడు.అప్పుడు దేవతలంతా ఆయనను వద్దని వారిస్తారు.
అయినా తాను ఇచ్చిన మాట తప్పకూడదని,నక్షత్ర మండలానికి మరో వైపు స్వర్గాన్ని సృష్టించి, తలక్రిందులుగా వేలాడుతున్న సత్యవ్రతుడిని అందులో అలాగే ఉండేలా చేస్తాడు.
కానీ ఏం లాభం ఆ రాజు భూమి మీద ఉన్న వాడూ కాదు.అలాగని స్వర్గంలో ఉండి ఆనందం, భోగ భాగ్యాలను అనుభవిస్తున్న వాడూ కాదు. భూమికి ఆకాశానికి మధ్య తలక్రిందులుగా వేలాడుతున్న దయనీయ స్థితి అతడిది.
అలాంటి అనిశ్ఛిత పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళనూ,ఎటూ తేల్చుకోలేని దైన్య స్థితిని త్రిశంకు స్వర్గంలో ఉన్నారని లేదా ఉన్నామని అనుకోవడం పరిపాటి.
గృహ బద్ధ కుమారీ న్యాయము ఈ కోవకు చెందినదే.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి