అంగుడిని సంతరించే అకారం
పెదిమెల పరిభాష మకారం
రెండింటి కలయిక మమకారం
అమ్మా!అమ్మా ఎంత మధురమైన మాట ఇల!!!
భావింప ఇలలోన నీకెవరు సాటి
అమ్మలగన్న అమ్మగా దుర్గమ్మా
ఇలను బ్రోచావు చల్లగా తల్లీ.
అపురూప లాలనా సంభూత!
అపూర్వ ప్రేమా సంద్రానివి
అనంత అభిమాన ఖనివి
తెలుసు నీకమ్మ ప్రేమలే పంచుతావు,
ద్వేషం లేదు అమృతా మూర్తివి !!
అఖండ జ్ఞాన సంపదా సరస్వతివి
ఆదరించుటలో మరి నీకు సాటి లేరు
తల్లీ,నీలోని కళలలో అద్భుతాలు
నీదు వాత్సల్యం నిరవధికం !!!
ఏమీ కోరవు ఒక సున్నితమైన వాక్కు,
ప్రేమపూరిత పిలుపు అదే అమ్మా !!
అదే నీకు ఆనందాల డోల అమృత హేల
సన్మానాల సౌరభాల మాల ధన్యహో !!
ఎందుకమ్మా ఇంత మంచి ఎవరు నీకు నేర్పించారు
ఇంత జ్ఞానం అపర విజ్ఞానాలతేల,అపర సౌరభాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి