తడి లేని చోట
మొలక మొలవదు.
దయలేని చోట
దైవముండ దు
మదిని మందిరముగా చేసి
కరుణను కొలువుంచితే
ఎదురుపడ్డ మనసులన్నీ
మనకు సొంతమే!
అంతరంగం స్వచ్చంగా
ఉంటే మమతల పంటలే!
కలుపులేరి కాపుకాస్తే
కరువు లేని భాగ్యమే!
మాను మోడౌతోందని
ఆక్రోశం దేనికీ??
వసంతం వస్తోందన్న
ఆనందం వేడుకే!
చేజారిన క్షణం కన్నా
రాబోవు తరుణం మిన్న!
రాలిపోవు ఆకులకన్నా
కనిపించే చిన్ని చివురే మిన్న!
తలుపు చిన్నదైనా
బయలు విశాలమే
దాటి చూసే మనసుంటే
జగము మధురమే!
తూరుపు ఎరుపు కాగానే
అంబరమంతా సంబరమే!
రేపు అన్న మాటెపుడూ
జీవితాలకు ఆధారమే!
మౌనంగా మమత పంచే
మనోహరమైన వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి