పదేళ్ళు పూర్తి చేసుకొన్న వావిలాల నేతాజీ స్కౌట్ ట్రూప్
 భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ రాజకీయేతర స్వచ్ఛంద సంస్థ.ఇది విద్యార్థుల్లో దేశభక్తి, దైవభక్తి, క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు,ఉత్తమ పౌరసత్వ లక్షణాలు పెంపొందించడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ.ఈ సంస్థ 1950 నవంబర్ 7 వ తేదీన జవహర్ లాల్ నెహ్రూ,బాబూ జగజీవన్ రామ్,కుంజ్రూ మొదలైన జాతీయ నాయకుల చేత ప్రారంభించబడింది.జాతీయ స్థాయిలో రాష్ట్రపతి,రాష్ట్ర స్థాయిలో గవర్నర్ ,జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ సంస్థకు అధ్యక్షులుగా ఉంటారు.దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఎస్టేట్ లో ఉంది.దీని కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలలో జిల్లాల వారీగా నిర్వహించబడుతాయి.కరీంనగర్ జిల్లా అసోసియేషన్ లో సభ్యులైన అడిగొప్పుల సదయ్య గారు 25-02-2013 న జి.ప.ఉ.పా.వావిలాలలో నేతాజీ స్కౌట్ ట్రూప్ పేరుతో యూనిట్ ప్రారంభించారు.ఈనెల 24వతారీఖుతో పది సంవత్సరాలు పూర్తిచే‌సుకొని 11 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.ఈ పది సంవత్సరాలకాలంలో సదయ్య ఈ యూనిట్ ద్వారా ఎన్నో సామాజిక అవగాహన కార్యక్రమాలు,సేవా కార్యక్రమాలు, స్కౌటింగ్ కార్యక్రమాలు చేయడం జరిగింది.స్కౌట్ మాస్టర్ గా అడిగొప్పుల సదయ్య గారు 2007 లో బేసిక్ శిక్షణ పొంది స్కౌట్ ఉద్యమంలో చేరారు.2013లో అడ్వాన్స్ శిక్షణ,2019 లో హిమాలయ ఉడ్ బ్యాడ్జ్ శిక్షణ మరియు 2020 లో ప్రి- అడల్ట్ లీడర్ ట్రైనర్ శిక్షణ పొంది ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ (స్కౌట్ విభాగం)గా వ్యవహరిస్తున్నారు.నేతాజీ స్కౌట్ ట్రూప్ విద్యార్థులు ఎన్నో స్థానిక,జిల్లా స్థాయి,రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్యాంపులలో పాల్గొని,ఎన్నో అవార్డులు, ధ్రువపత్రాలు పొందడం జరిగింది.నేతాజీ స్కౌట్ ట్రూప్ ద్వారా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు వరుసగా:
25-02-2013 - నేతాజీ స్కౌట్ ట్రూప్ ప్రారంభం.
స్కౌట్ ట్రూప్ కార్యక్రమాలను మూడు రకాలుగా విభజించి పేర్కొనవచ్చు.
1.సామాజికోపయోగ కార్యక్రమాలు
2.సేవా కార్యక్రమాలు
3.స్కౌటింగ్ కార్యక్రమాలు.
1.సామాజికోపయోగ కార్యక్రమాలు:
-2013 నుండి ప్రతి సంవత్సరం వావిలాల గ్రామంలో క్రింది అంశాలపై అవగాహనా ర్యాలీలు చేయడం జరుగుతోంది.
i).మట్టి వినాయక విగ్రహాల వాడకం-పర్యావరణ పరిరక్షణ
ii).సీజనల్ వ్యాధులూ -జాగ్రత్తలు
iii).పొగాకు, గుట్కాల వాడకం-దుష్ఫలితాలు
iv)).తెలంగాణాకు హరితహారం
v).స్వచ్ఛ్ భారత్ -సుందర్ భారత్
vi).హరితహారం
2.సేవా కార్యక్రమాలు:
-- 2013లో "శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు-ఇల్లందకుంట దేవాలయం"లో స్వచ్ఛంద సేవ.
-- 2014 లో " శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు -ఇల్లందకుంట దేవాలయం"లో స్వచ్ఛంద సేవ.
-- 2015 లో " శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు -భద్రాచలం"లో స్వచ్ఛంద సేవ,భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఖమ్మం జిల్లా అసోసియేషన్ వారి ప్రశంసాపత్రం పొందడం.
--2016 లో "గోదావరి మహా పుష్కరాల్లో" కాళేశ్వరం దేవాలయంలో స్వచ్ఛంద సేవ-కలెక్టర్ గారి చేత ప్రశంసాపత్రాలు పొందడం.
-- 2017 లో "శివరాత్రి మహోత్సవాలు- కాళేశ్వరం"లో స్వచ్ఛంద సేవ,దేవాలయ ఈ.ఓ.గారి చేత ప్రశంసాపత్రం పొందడం.
-- 2018 లో "సమ్మక్క సారలమ్మ జాతర-వావిలాల"లో స్వచ్ఛంద సేవ, మాజీమంత్రి ఈటెల రాజేందర్ గారి చేత ప్రశంసలు పొందడం.
-- 2020 కరోనా కాలంలో 30మంది పేద విద్యార్థులకు నిత్యావసర వస్తువుల వితరణ.
-- 2021 లో "వైష్ణోదేవి ఆలయం" జమ్ము& కాశ్మీర్ లో స్వచ్ఛంద సేవ.
3.స్కౌటింగ్ కార్యక్రమాలు:
-- పాఠశాల ఆవరణలో "స్వచ్ఛ్ భారత్ " నిర్వహణ
-- పాఠశాల ఆవరణ,గ్రామంలో "హరితహారం కార్యక్రమాలలో" పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.
-- ఇప్పటి వరకు 40 మంది విద్యార్థులు తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంపులలో పాల్గొని ఉత్తీర్ణత సాధించారు.
-- 20 మంది విద్యార్థులు రాజ్యపురస్కార్(గవర్నర్) అవార్డులు పొందారు.
-- 2016 లో "చెన్నై స్వచ్ఛ్ భారత్ -సుందర్ భారత్ వర్క్ షాప్ క్యాంపు" లో ఐదుగురు స్కౌట్లు పాల్గొని,వివిధ పోటీలలో ప్రతిభను కనబరిచారు.
-- 2017 లో " 17 వ జాతీయ జంబోరి-మైసూరు, కర్ణాటక "లో నలుగురు స్కౌట్లు వివిధ సాహసకృత్యాలలో పాల్గొని,అనేక పతకాలు, అవార్డులు సాధించారు.
-- 2018 లో పెట్రోల్ లీడర్ క్యాంపులో ఎనిమిది మంది స్కౌట్లు పాల్గొని,ప్రతిభ కనబరిచారు.
-- 2019 లో గవర్నర్ పాల్గొనే గణతంత్ర దినోత్సవ పెరేడ్ -హైదరాబాద్ లో ఇద్దరు స్కౌట్లు పాల్గొన్నారు.
-- 2020 లో అమెరికా,బ్రిటన్ ,ఫ్రాన్స్ మొదలైన నూట తొంభై దేశాలు పాల్గొన్న "ఆన్ లైన్ అంతర్జాతీయ జంబోరీ "లో 16 మంది స్కౌట్లు పాల్గొని, వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్కౌట్ మూవ్ మెంట్ చైర్మన్ గారి ధ్రువపత్రాలు పొందారు.
--  2023 జనవరిలో "18 వ జాతీయ జంబోరి-రాజస్థాన్" లో ఇద్దరు స్కౌట్లు పాల్గొని,జాతీయ సమైక్యత,సాహస కృత్యాల అవార్డులు, బంగారు పతకాలు సాధించారు.
2013 లో ప్రారంభించబడిన ఈ ట్రూప్ లో 32 మంది స్కౌట్లు సభ్యులుగా ఉన్నారు.ట్రూప్ నిర్వహణకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక వనరులు సమకూర్చబడవు.తన మిత్రులు ఇచ్చిన ఆర్థిక సాయంతో సదయ్య గారు 32 మందికి స్కౌట్ యూనిఫామ్స్ సమకూర్చుకున్నారు.వాటిని పాఠశాలలో భద్రంగా నిల్వ చేస్తూ కార్యక్రమాలు ఉన్న సందర్భాల్లో స్కౌట్లు వినియోగించేలా చూస్తారు.ట్రూప్ నిర్వహణలో వీరికి  ఇంకా టెంటులు,వెదురు కర్రలు,త్రాడులు,గొడ్డలి,గడ్డపార లాంటి క్యాంపు సామాగ్రి అవసరం.ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వాటిని సమకూరిస్తే స్కౌటింగ్ కార్యక్రమాలు ఇంకా విజయవంతంగా నిర్వహిస్తామని స్కౌట్ మాస్టర్ అడిగొప్పుల సదయ్య అంటున్నారు.



కామెంట్‌లు