జన్మ భూమి; - -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
జన్మనిచ్చిన తల్లిలా
జన్మభూమి గొప్పదోయ్!
ఎచ్చోటికి ఏగినా
ఏమాత్రం మరవకోయ్!!
     మాతృభూమి మహోన్నతం
     జీవితాన్ని చేయాలోయ్!
     ఉండగానే అంకితం
    జన్మమిక సార్ధకమోయ్!
అహర్నిశలు పాటుపడి
దేశకీర్తి పెంచాలోయ్!
మువ్వన్నెల జెండాలా
నలుదిశలా చాటాలోయ్!
      జన్మభూమి ఋణాన్ని
      తీర్చలేని బ్రతుకేల?
      మాతృభూమిపై ప్రేమలేని
      వట్టి మట్టి మనసులేల?


కామెంట్‌లు