బాలల గేయం :- బాలల్లారా... !-- కోరాడ నరసింహా రావు,.

బాలల్లారా  రారండి.... 
  శివుని కోవెలకు వెళదాము !
 శుద్ధజలములతో  శివ
      లింగమును స్నానమునే 
         చేయిద్దాము... !!
పాలు, తేనె, పెరుగు, చక్కెర 
  పంచామృతముల అభి 
  షేకించి కొబ్బరికాయను కొద దాము, కొబ్బరి నీళ్లను వేద్దాము 
అరటి పండ్లనే పెడదాము..., 
 విభూది నిండుగ వేద్దాము... 
      జిల్లేడు పూలు , మారేడు దళములను  భక్తి- శ్రద్దలతొ అర్చిద్దాము .... !  
   సాంబ్రాణి, అగరువత్తుల 
      ధూపమునే వేద్దాము... !
  కర్పూరమునే వెలిగించి.... 
    నీరాజనములనిద్దాము !
 మనపాపములన్నీ పోగొట్టి 
.మనలను చల్లగ చూడమని ఆ పరమ శివుని ప్రార్ధిద్దాము... !
       బాలల్లారా  రారండీ.... 
 శివాలయమునకు వెళదాము!
        ******
కామెంట్‌లు