గాసటబీసట; - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మంచి
చేద్దామనుకుంటే
నమ్మకున్నారు

హితవు
చెబుదామనుకుంటే
వినకున్నారు

బాగు
చేద్దామనుకుంటే
పడనీయకున్నారు

దారి 
చూపిద్దామనుకుంటే
పెడచెవినిపెడుతున్నారు

అందాలు
చూడమంటుంటే
అగపడుటలేదంటున్నారు

ఆనందం
పొందమంటుంటే
ఆస్వాదించలేమంటున్నారు

సహాయం
అందజేస్తామనుకుంటే
తిరస్కరిస్తున్నారు

సంస్కరిద్దామనుకుంటే
సహకరించక
సంప్రదాయమంటున్నారు

పాటలు
పాడితే
పట్టించుకోకున్నారు

కవితలు
పంపితే
చదవకున్నారు

కథలు
రాస్తే
పఠించకున్నారు

కుక్కను
గాడిదను
ఒకేగాట కట్టేస్తున్నారు

నియమాలు
పాటించమంటే
గాసటబీసట చేస్తున్నారు

ఇక
కళ్ళు
మూసుకుంటా
అంధుడిలా ప్రవర్తిస్తా

చెవులు
మూసుకుంటా
చెవిటోడిలా నటిస్తా

నోరు
మూసుకుంటా
మూగవాడిల మసులుతా

మనసును
మూసేస్తా
పిచ్చోడిలా బ్రతుకుతా


కామెంట్‌లు