శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఖిచడీ అంటే బియ్యం పెసర మినుము కంది ఇలా రకరకాల పప్పుల్ని కల్పివండేది.కల్సికట్టుగా దొంగతనం చేయడం  గూడుపుఠాణీ అనే అర్ధం లో వాడుతున్నాము. తుర్కీస్థాన్ లో అతిథిసత్కారంకోసం తప్పకవండి దగ్గర ఉండి మరీ ఆప్యాయంగా తిన్పించేవారు.వచ్చిన అతిధి నోట్లో స్వయంగా ఖిచడీ పెట్టి "మీపేరు తెల్పండి"అనే సాంప్రదాయం టర్కీలో ఉండేది. బాబర్ కాలంలో మనదేశంలోకి ఈవంటకం ప్రవేశించింది.కృసరాన్నం అంటే అన్న మిశ్రమం.ప్రాకృతంలో ఖిచ్చ బెంగాలీలో ఖిచరీ ఒరియాలో ఖిచురా గుజరాతీ లో ఖిచ్ అంటారు. 
గంధర్వ ఓప్రాచీనజాతి.గంధం సంగీత వాద్యాది జనిత ప్రమోదం అర్వతి ప్రాప్నోతి ఇతి.సంగీతం వాద్యాలతో కలిగే ఆనందం  గంధర్వం అని భావం.సామాన్య అర్ధం  సంగీతాచార్యుడు.ఋగ్వేదంలో గంధర్వ ప్రస్తావన ఉంది. యజుర్వేదంలో27 అథర్వవేదంలో6333 గంధర్వులు అని చెప్పటం జరిగింది. కశ్యప అరిష్టా ల  సంతానం. దేవతలతర్వాత వీరిది మూడోస్థానం! భారతంలో చిత్ర రధుడు గంధర్వపతి.
సంగీతం వాద్యసంగీతం లో వారు నిపుణులు. ఇంద్రసభలో ఉంటారు. అందమైనవారుకూడా!తరుణులను అప్సరసలు అంటారు. కానీ ఇప్పుడు ఈజాతి అస్తిత్వం కోల్పోయింది.యు.పి.లో వారణాసి  ఇలహాబాద్ గాజీపుర్ రాజస్థాన్ లో గంధర్వ పేరు తో ఓజాతివారున్నారు.కానీ పైన పేర్కొన్న గంధర్వుల కి వీరికి ఎలాంటి సంబంధం లేదు. కానీ వీరి వృత్తి  పాడటం వాద్యాలతో  నాట్యంతో అలరిస్తారు. రాజస్థాన్ లో వారు వైశ్యులు.గుజరాత్ లో గంధ్రప్ అనిపిలుస్తారు.గొప్ప సంగీతాన్ని పాడేవారిని మనం గంధర్వ బిరుదుతో పిలుస్తాము.గాన గంధర్వుడు అందరికీ తెలిసిన ఎస్.పి.బాలు గారు 🌷

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం