33వ విజయవాడ పుస్తక ప్రదర్శన ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ప్రాంగణంలో గొల్లపూడి మారుతీ రావు వేదిక మీద ప్రముఖ కవయిత్రి శ్రీమతి నెల్లుట్ల సునీతను ప్రసిద్ధి స్త్రీవాద రచయిత్రి వోల్గా సునీతను ఘనంగా సన్మానించారు. సాహితీ బృందావన విహార వేదికను స్థాపించి ఎన్నో సాహిత్య కార్యక్రమాలు చేస్తూ కవులను ప్రోత్సహిస్తూ పురస్కారాలు బిరుదులు సత్కారాలతో. .. సత్కరించి వివిధ సందర్భాల్లో కవిత పోటీలు నిర్వహించి. నగదు బహుమతులతో సత్కరించి. పలు సంకలనాలు వెలువరించి. పుస్తక రచయితలను ప్రోత్సహిస్తూ వివిధ కవులు రచించిన పుస్తకాలకు పుస్తక నగదు బహుమతులు అందిస్తూ.. వైవిద్యమైన ప్రక్రియలో నూతన సున్నితం సరళ శతకం సున్నితాలు రూపొందించి విద్యార్థులను. బాలకవులను వర్తమాన కవులను, తీర్చిదిద్దుతూ వారి నుండి సాహిత్యాన్ని అందిస్తున్నారు అని కొనియాడారు. తెలుగు భాష పరిరక్షణ కోసం ఎంతగానో పాటుపడుతూ సేవలు అందిస్తూ.. కృషి చేస్తున్నారు. అని వోల్గా అందించారు.. శ్రీమతి నెల్లుట్ల సునీత తన సంపాదకత్వంలో వచ్చిన పదునెక్కిన కలం కాళోజి స్మృతి కావ్యాన్ని నవల రచయిత్రి శ్రీమతి ఓల్గా కు ఆత్మీయంగా పుస్తక బహుమతి ని బహుకరించారు. పది నెక్కిన కలం లో కవులు కవయిత్రులు చక్కటి కవితల్ని అభ్యుదయ భావాలతో పదునెక్కించారు. అని ఓల్గా గారు అన్నారు. శ్రీమతి నెళ్లుట్ల
సునీత రూపొందించిన తెలుగు నూతన సాహిత్య ప్రక్రియ సున్నితం
లో ప్రముఖ కవులు కవయిత్రులు రచించిన పుస్తకాలను సాహితీ బృందావన విహార వేదిక నుండి విశాలాంధ్ర బుక్ హౌస్ లో పుస్తక ప్రదర్శనలో ఉంచామని నెల్లుట్ల సునీత తెలిపారు. ఈ అవకాశం కల్పించిన విశాలాంధ్ర బుక్ హౌస్ భాషా గారికి ధన్యవాదాలు తెలిపారు.
వోల్గా గారికి పుస్తక ప్రదర్శనలో భాగంగా పదునెక్కిన కలం పుస్తకాన్ని ఆత్మీయంగా బహూకరించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
పలువురు ప్రముఖ సాహితీ వేత్తలు. కవులు, కవయిత్రులు, అధ్యాపకులు నెల్లుట్ల సునీతకు అభినందనలు తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి