నా భాష ;- లత శ్రీ
నా భాష నా మాతృభాష
తెలుగు వెలుగు ల జిలుగుర
అజంతాల భాష ర
అన్యభాష మైకంలో 
మరువకు రా కమ్మనైన భాష

1.ఒంపుల శిల్పము
సొంపుల గమనము
జుంటి తేనే చందము
గుమ్మపాల మకరందము!!నా భాష!!

2.అదరమే మధురము
పలికితే సుమస్వరము
సోయగాల జానపదము
మదిని నింపు పరిమళము!!నా భాష!!

3.గలగలలా గోదారిలా
కిలకిలల కృష్ణమ్మలా
మధుర భావాల సుధల వాహినీ
మనసుమీటు మధురజ్నాపకం!!నా భాష!!

4.యెంకిపాటలా ఇంపైనది
కోయిల గానంతో సమమైనది
అన్నమయ్య పదబంధం తో
రాయలవారి ఆదరణలో
ప్రపంచాన వెలుగొందినది!!నా భాష!!

కామెంట్‌లు