సుప్రభాత కవిత ; - బృంద
వ్యక్తమయే శివరూపము కన్నా
అవ్యక్త శివ తత్వం  చాలా గొప్పది

ప్రాణ శక్తి స్వరూపుడు రుద్రుడు
శివుడు..

సకల రోగాలకు వైద్యుడు...
రుద్రుడు

సర్వారిష్ట నివారణకూ
శివారాధనే

అన్నిటా తానై.....ఎవరూ కాక
అన్నీ తానై..... తానే  కనపడక
కనిపించక నడిపించే నడకకు
ఆధారం
నడకలకు నీడై తోడై ఉండే
నేస్తం....శివుడు

విశ్వమంతా నిండిన
శివ తత్వాన్ని 
అర్థం చేసుకోవడమే 
భక్తి

మనము అనుభవించే
దుఃఖం .....సుఖం
రెండూ ఇచ్చేవాడు
శివుడే!
శరణంటే పోగొట్టేవాడూ
శివుడే!

పంచభూతాలలో
వ్యాపించి ఉన్న
వ్యవస్థలో క్రమశిక్షణ 
శివతత్వం..

పంచభూతాత్మకమైన
మన శరీరంలో 
చైతన్యం రూపంలో
ఉన్నది శివుడే!

ఎల్లవేళలా  మనకు
శుభాలనివ్వాలన్నదే
శివతత్వం

శివోపాసన అంటే
మనలోని శివుని కనుగొని
ప్రకృతి లోని ప్రతి అణువులోనూ
శివుని చూడగలగే సాధన

మనం పూజించే చిన్న శివలింగంలో
యావత్ సృష్టి మొత్తం
వ్యాపించిన  శివుడిని
గుర్తించి  ఆ తత్వంలో
మమేకమవడమే  ఆరాధన

ప్రకాశ స్వరూపుడైన 
శివుని భావించగానే
హృదయాన కలిగే
ప్రశాంతతే  శాశ్వతమైన 
ధ్యానఫలితం

ఈశావాస్యమిదం సర్వం🙏

మహాశివరాత్రి పర్వదినపు
శుభాకాంక్షలతో

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు