అరుదైన పువ్వు;- - యామిజాల జగదీశ్
 హవాయి ద్వీపంలోని రకరకాల పువ్వులలో 
మౌనా కీ  ( ఈ పువ్వు పూర్తి పేరు Mauna Kea silversword)  ఒకటి. ఈ పువ్వుని సహనానికి చిహ్నంగానూ పేర్కొంటారు. ఇదొక అరుదైన పువ్వు. అంతరించిపోతున్న  ఈ పువ్వు Asteraceae కుటుంబానికి చెందినది. పొద్దుతిరుగుడు పువ్వులు, డైసీలు వంటి ఇతర పువ్వులుకూడా ఈ కుటుంబానికి చెందినవే.
మౌనా కీ మొక్క ఆకులు ఖడ్గాకారంలో కన్పించడంవల్ల ఈ పువ్వుకి ఆ పేరు వచ్చింది. తీవ్రమైన ఎండ, అధిక గాలుల నుండి కాపాడటంలో ఈ మొక్కలు ఎంతగానో ఉపయోగపడ తాయట. 
ఈ మొక్క దీర్ఘకాలముంటుంది. పుష్పించే కొమ్మ పొడవుగా పెరుగుతుంది. ఒక్కో కొమ్మ పొడవు ఆరడుగులు ఉంటుంది. పైగా 
వందలాది చిన్న, ప్రకాశవంతమైన ఎరుపు లేదా నారింజ వర్ణ పువ్వులతో కప్పబడి ఉంటుంది. 
ఒక పువ్వు పూయడంతోనే మొక్క వాడిపోవడం ఆరంభమై క్రమంగా చనిపోతుంది. కఠినమైన వాతావరణం లోనూ ఈ మొక్క తట్టుకోగలదు. పాలిచ్చే జంతువులు ఈ మొక్కలను లాగించేస్తుంటాయి.
ఏదేమైనప్పటికీ ప్రత్యేకతను సంతరించుకున్న ఈ పూల మొక్క జాతిని పరిరక్షించడానికి తగు చర్యలు తీసుకోవలసి ఉందని స్థానికుల మాట.


కామెంట్‌లు