వేప చెట్టు , ప్రాముఖ్యత.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 వేప చెట్టు ఇంటి ముందు ఉండడం చాలా మంచిది. వేప చెట్టు గాలి ఇంట్లోకి రావడం వల్ల విషక్రిములు నశిస్తాయి. చర్మ రోగాలు హరిస్తాయి. స్పోటకం మొదలైన వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడుతుంది. చెమట వల్ల వచ్చే క్రిముల్ని నాశనం చేస్తుంది. వేప చిగురు తినడం వల్ల రక్తం శుద్ధి చెంది, విషప్రాణులు కరిస్తే కూడా విషాన్ని ఎక్కనికుండా చేస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని హరిస్తుంది. ఇలా ఎన్నో శాస్త్రీయ ప్రయోజనాలు ఉండబట్టే వేప చెట్టు గాలి ఇంట్లోకి వచ్చేట్లుగా ఇంటిముందు ఇరువైపులా వేప చెట్లు ఉండాలంటారు. మన పెద్దలు. ఇంటి ముందు మునగ, వెనుక వేప ఉండరాదని అంటారు. కారణం ముందు మునగ చెట్టు ఉంటే అందరూ కాయలు కోసుకుని వెళ్లడమే గాక-ఆ చెట్టు వేర్లలో, కాండం లోపల ఉండే కొన్ని తిరుమల నుండి వచ్చే గాలి-ఇంటివారికి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. వెనుక వేప ఉండడం వల్ల ఆ గాలి ఇంటి వారికి రాదు. చెట్టు ఉండి కూడా ప్రయోజనం లేదు. అందుకే ఈ విషయాన్ని'వాస్తుకు'జోడించి, ఇంటి వెనుక ఉండరాదు అన్నారు.
ప్రదక్షిణాలు చేయడంలో మనం తెల్ల జిల్లేడు, రావి, జమ్మి చెట్లకు ప్రాధాన్యత ఇస్తాము. ఈ మూడు చెట్లు తమ స్పర్శ వల్ల, వాసన వల్ల, గాలి వల్ల శరీరం పైన, లోపల ఉండే ఎన్నో రోగాలని పోగొట్టి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఇవన్నీ నేటి విజ్ఞానవేత్తలు పరిశీలించి, ప్రయోగాలు చేసి, నిరూపించారు. మన పూర్వులు చరిత్రకు అందని కాలంలోనే వీటి విలువలు గుర్తించి, ప్రదక్షిణ యోగ్య వృక్షాలుగా వీటిని నిర్దేశించారు.

కామెంట్‌లు