ప్రశాంతత! అచ్యుతుని రాజ్యశ్రీ

 జీవితంలో దు:ఖం విషాదం తప్పవు.వెలుగువెంట చీకటి! పరీక్షఫైయిలైతే రాంక్ రాకపోతే అనుకున్న దానిలో సీటురాకపోతే నిరాశ తో పాటు "ఛ వెధవబతుకు" అనిపించడం సహజం!ఇంటిలో ఆలుమగలు సాధించడం ఏమవుతుందో ఏమో అని నెగిటివ్ గా ఆలోచించడం వల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇదే ప్రస్తుతం శివా ఇంట్లో పరిస్థితి!"బామ్మా!ఏంచేస్తున్నావు?" అని అడిగితే "ఏంచెప్పేదిరా శివా! మీతాతతోపాటు నేను కూడా పోతే బాగుండేది.నన్ను ఆదేవుడు ఎప్పుడు తీసుకుని వెళ్తాడో?"అని బుడిబుడి రాగాలు తీస్తుంది. ఆఫీసు నించి విసుగ్గా రెండు బస్సులు మారి వచ్చిన నాన్న "ఈఆఫీసర్ ప్రాణం తీస్తున్నాడు.ఇల్లు ఇరకటం ఆలి మర్కటం"అని కోపం అంతా అందరిపై కుమ్మరిస్తాడు.ఇక  అమ్మ ఏమో "ఇంటా బైట గొడ్డు చాకిరీ!టెన్త్ క్లాస్ స్పెషల్ క్లాస్ తో ప్రాణాలు పోతున్నాయి."అని గొణుగుతుంది.అత్తగారు కుంభం వండి దుబారాచేస్తోందని పిల్లి ఎలుక మీద పెట్టి సాధిస్తుంది. ఇవన్నీ వింటూంటే శివా బుర్ర గిర్రున తిరుగుతుంది.  ఒక రోజు  సైకాలజిస్ట్ వచ్చి పిల్లల కి ఇలా చెప్పాడు."పరీక్షలముందు మీరు టెన్షన్ పడరాదు.మీసమస్యలు చెప్పండి".శివా తన ఇం టి పరిస్థితి చెప్పాడు.ఆయన చెప్పిన  సలహా ఇది"మీబామ్మ అమ్మ నాన్న లు వారి బాధ్యత పనిభారంతో అలా విసుగ్గా మాటల ఈటెలు రువ్వుతారు.అవి పట్టించుకోవద్దు.ప్రశాంతంగా నీకు నచ్చిన ఫ్రెండ్ ఇంట్లో కంబైన్డ్ స్టడీస్ వల్ల ఇద్దరికీ లాభం!లేదా లైబ్రరీలో కూచుని చదువుకో!" పరీక్షలటైంలో ఇది చాలా ముఖ్యం సుమా🌹
కామెంట్‌లు