సుప్రభాత కవిత ;- బృంద
పడమట దాగిన వెలుతురు
పువ్వు.....
తూరుపున పైకి తేలుతూ

వెలుగుల రవ్వలు
వెలుతురు ముత్యాలూ
బంగారు కిరణాలతో
పసిడి అభరాణాలు

పుడమికి తొడిగి
పుత్తడి కళకళల
మెరిసిపోతున్న వైనం చూసి
మురిసిపోయి
 
నింగిని సాగుతూ 
మురిపెంగా చూస్తూ....
మబ్బులకు పిలిచి
అందాలు చూడమని
పిలిచి మరీ చూపిస్తూ...

ఆరాధనగా చూసే
అవనీ కన్య కంటి చూపుకు
కరిగిపోయి.....
కమ్మని కలలిచ్చి
నెమ్మదిగ సెలవడిగి

సంధ్యారాగపు మధురిమలో
మైమరచి ఆవరించిన
చీకటిని గమనించక

మరుసటి ఉదయం 
మనసుకు నచ్చే క్షణాలు
మోసుకొచ్చే ....

వెలుగు బంతికై
కమ్మని  కలలు కనుల
నింపుకుని 

కరిగే రేయిని కదలిపొమ్మంటూ
రెప్పలు మూసిన 

భువనపు భూపాలపు
పిలుపులు విని
పరుగులు పెడుతూ
వచ్చే ఉదయానికి

🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు