నమ్మకం!అచ్యుతుని రాజ్యశ్రీ

 మనకు మనపై బాగా నమ్మకం ఉండాలి. అలాగే ఇంకోరిపై ముఖ్యంగా డాక్టర్ పై నమ్మకం లేకుంటే రోగం త్వరగా తగ్గదు.శివా తాత హోమియో మందులు ఇచ్చిపెద్ద ఆసుపత్రి చుట్టూ తిరగకుండా  డబ్బు ఎక్కువ ఖర్చు కాకుండా ఆఊరివారికి వైద్యం చేస్తాడు. జనం కూడా చిటికెలో రోగం తగ్గింది అని సంబరపడతారు.ఓసారి హరి అనే దూరపుబంధువు వచ్చాడు. ఆయన వయసు 50కానీ బి.పి.షుగర్ టెన్షన్ తో ఉక్కిరిబిక్కిరి అవుతాడు.ఓపెద్ద కంపెనీ డైరెక్టర్. "వారంరోజులు నాదగ్గర ఉండు.చిన్న చిన్న చిట్కాలు చెప్తాను " అని తాత అన్నాడు. రెండ్రోజులు కాగానే హరి తాత తో"అమ్మో!నాకంపెనీ నేను లేకుంటే నడవదు. ఎవడికి వాడు తనే రాజు అని పోజుపెడతారు.నేను ఉండబట్టే కంపెనీ లాభాలబాట పట్టింది.ఎంతో మంది పెద్ద డాక్టర్ల మందులు మింగుతున్నాను.ఫలితం శూన్యం. నీతీపి చిన్న గోలీలు ఏంపనిచేస్తాయి?" అని కాస్త హేళనగా అన్నాడు. "చూడు హరీ!నీపైవాడు విదేశీయుడు.కానీ నీపై నమ్మకం తో ఎం.డి.నిచేశాడు.అలాగే నీవు కూడా నీకిందవారిని నమ్మాలి. సరే ముందు ఈమాత్రలు వేసుకో."నాకు ఏంఫర్వాలేదు.ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉన్నాను అని నీకు నీవే ఆటో సజెషన్ ఇచ్చుకోవాలి.మంత్రం లాగా అనుకోవాలి.చిన్న తీపి హోమియో మందు ఏంపని చేస్తుంది  అనే అనుమానం ఉంటే మందు పనిచేయదు.నాదగ్గర కొచ్చేవారు సంపూర్ణ  నమ్మకం తో వచ్చి మందు తీసుకుని వారం తర్వాత  రోగం నెమ్మదించింది అని చెప్తారు ". తాత మాటల్తో హరిలో మార్పువచ్చింది.🌹
కామెంట్‌లు