న్యాయాలు -59
గేహే శూర న్యాయము
*****
గేహ అంటే ఇల్లు.గేహే అంటే ఇంట్లో. శూర అంటే వీరుడు.మరి గేహే శూరుడు అంటే అర్థం ఏమిటో చూద్దాం. ఉత్త బెదురు గొడ్డు.అధీరుడు.ఇంట్లో కూర్చుని డంబాలు పలికే వాడు. తన గురించి గొప్పగా చెప్పుకునే వాడు. ఆచరణలో ఎందులో కొరగాని వాడని అర్థం.
ఇలాంటి వ్యక్తిని అతని ప్రగల్భాలను గేహే శూర న్యాయముతో పోలుస్తారు.ఒక విధంగా ఉత్తర కుమారుడి ప్రగల్భాలు, ప్రజ్ఞలు అని అనవచ్చు. ప్రగల్భాలు అంటే తెలుసు కదా! తనకు లేని సామర్థ్యాలను ఉన్నట్లు గొప్పగా చెప్పుకోవడం.
మహా భారతంలో ఉత్తర కుమారుడు అనే పాత్ర కనిపిస్తుంది. అతడు విరాట్ రాజు కుమారుడు.విరాట పర్వములో కౌరవులకు చెందిన సుశర్మ సేనలు దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వీరులతో కలిసి విరాటుని పశు సంపదను ముట్టడించారు.
అక్కడ ఉన్న విరాటుని కొద్ది పాటి సైన్యం కౌరవ సైన్యాన్ని ఎదిరించ లేకపోయింది.విరాటుని గవాధ్యక్షుడు వెంటనే నగరంలోకి వచ్చాడు.వీరులు ఎవ్వరూ ఆ సమయంలో లేరు. ఉత్తర కుమారుడు ఒక్కడే రాజ భవనంలో ఉన్నాడు.
అతని శౌర్య పరాక్రమాలను పొగుడుతూ అవి చూపే సమయం ఆసన్నమైంది. వెంటనే బయలు దేరమని చెబుతాడు. అతడి పొగడ్తలతో ఉబ్బి తబ్బిబ్బై అర్జునుని తలపించేలా యుద్ధం చేసి ఆలమందలను విడిపిస్తానని అందుకు తనకు తగిన సారధి కావాలి అంటాడు.
అజ్ఞాత వాసంలో బృహన్నల రూపంలో ఉన్న అర్జునుని తీసుకుని వెళ్ళమని సైరంధ్రి( ద్రౌపది) చెబుతుంది.
యుద్ధానికి వెళ్ళి ప్రతాపం చూపించే సమయంలో బృహన్నల సారథ్యమా! అని మొదట కొంచెం అవమానంగా భావించినా,ఆ తర్వాత ఒప్పుకుంటాడు.
ఆ సమయంలో తన చెల్లెలు ఉత్తరకు ఆడుకునే బొమ్మలకు మరణించిన వీరులు ధరించిన వస్త్రాల అంచులు, రంగు రంగుల గుడ్డ ముక్కల్ని తీసుకుని వస్తానని డంబాలు పలుకుతాడు.
అలా బృహన్నలను తీసుకుని యుద్ధ భూమికి వెళతాడు.అక్కడ సముద్ర మంత కనిపించిన కౌరవుల సైన్యం చూసి భయపడి పోతాడు.
వాళ్ళను జయించడం తన వల్లే కాదు, దేవతలకు కూడా సాధ్యం కాదని రథాన్ని వెనక్కి తిప్పమని అంటాడు. లేదంటే వాళ్ళ చేతిలో ఆహుతై పోతానని బృహన్నలతో చెబుతాడు.
ఆ విధంగా ముందు ప్రగల్భాలు పలికి వీరోచిత ప్రజ్ఞలు చేసి తర్వాత ఇలా నీరుకారి పోవడాన్ని ఉత్తర కుమార ప్రగల్భాలు, ప్రజ్ఞలు లేదా గేహే శూర న్యాయమని అంటారు.
దీనినే వేమన తన పద్యంలో "మేడిపండు చూడ మేలిమై యుండును/ పొట్ట విచ్చి జూడ పురుగులుండు/ పిరికివాని మదిని బింకమీలాగురా/ విశ్వధాభిరామ వినురవేమ!" అంటాడు.
మేడిపండు పైకి నిగనిగ లాడుతూ చక్కగా కనిపిస్తుంది. లోపల మాత్రం పురుగులు కనిపిస్తాయి.అలాగే పిరికి వాడు పైకి బింకాన్ని ప్రదర్శిస్తాడు కానీ లోపలంతా పిరికి తనమే.ఇలాంటి వాళ్ళు ఎందుకూ కొరగారు.వీరివల్ల ఏదీ సాధ్యం కాదు అని అర్థంతో ఈ న్యాయమును పోల్చవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి