కశ్యప ప్రజాపతి;- తాటి కోల పద్మావతి గుంటూరు


 కశ్యప మహర్షి కశ్యప ప్రజాపతి. మరీచి మహర్షికి,"కళ"కు జన్మించిన వాడే కశ్యప మహర్షి. బ్రహ్మ యొక్క సలహా మేర దక్ష ప్రజాపతి తన కుమార్తెలు అయిన అదితి, దితి, దనువు, కాల, అనాయువు, సింహిక, ముని, కపిల, క్రోధ, ప్రధ, క్రూర, వినత, కద్రువలను ఇచ్చి వివాహం చేశాడు. అదితి గర్భంలో ఆదిత్యులు దితి గర్భంలో హిరణ్యాక్ష, హిరణ్య కశిపులు పుట్టారు. పశు, వృక్ష, కీటక, పక్షి జాతులను కశ్యపుడే సృష్టి కావించారు. పరశురాముడు భూమి మొత్తాన్ని జయించి కశ్యపునికి దానం ఇచ్చాడు. కావున భూమిని"కాశ్యపి"అని పిలుస్తారు. కశ్యపుడు అదితికి వేరు వేరు యుగాలలో వామనుడు, శ్రీకృష్ణుడు జన్మించారు. అంటే కశ్యపుడే వసుదేవుడిగా జన్మించారని అర్థం. కశ్యపుడు"దితికి"మరుద్గణం పుట్టారు. దేవదానవులు చాలామంది కశ్యపసంతానమే.


కామెంట్‌లు