ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉంటే ........ భగవంతుడు ఎక్కడో కాదు .... నీలో, నాలో, మనందరి లో ఉంటాడు అన్నది వేదోక్తి .
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇతరులకు సహాయం చేయడం, దానం చేయడం. ఓ వ్యక్తిని మంచి వ్యక్తా కాదా వారి గుణగుణాలేంటి అని తెలుసుకోవటానికి ఆ వ్యక్తి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోనక్కర్లేదు..ఆ వ్యక్తిలోని కొన్ని లక్షణాలను పరిశీలిస్తే చాలు. వాటిలో ముఖ్యమైనవి ఆ వ్యక్తి యొక్క నడవడిక అలాగే దానం చేసే గుణం అని మన పూర్వీకులు తరచుగా అంటుంటారు.
లండన్ లో ఒక రోజు ఉదయం చాలా చలిగా వుంది. మంచు ఆగకుండా కురుస్తొంది. ఎప్పుడూ రద్దీగా వుండే ఒక వీధిలో ఒక మూల ఒక అరవై ఏళ్ళ ముసలి వ్యక్తి ఒక చిన్న స్టూలుపై కూర్చోని ఎంతో శ్రమతో తన వయొలిన్ వాయిస్తున్నాడు. రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే కూర్చోని వయొలిన్ వాయిస్తూ , దారిన పోయే వారు ఇచ్చే చిన్న చిన్న దానంతో తన పొట్ట పొసుకుంటుండేవాడు.
అయితే ఆ రోజు అతని ముందు వున్న పళ్ళెం ఖాళీగా వుంది.ఒక్కరు కూడా ఆగి అతని సంగీతం విని కాస్తంత సహాయం కూడా చెయ్యడం లేదు. మధ్యాహ్నం వరకు ఆ ముసలి వ్యక్తి వయొలిన్ వాయించి అలిసిపోయాడు. ఆ సరికి చాలా తక్కువ సొమ్ము జమ అయ్యింది. ఇక ఆ రోజుకు తన అదృష్టం అంతే అనుకున్నాడు. ఈ కాస్త సొమ్ముతో బ్రెడ్ కూడా దొరకదు. ఇక ఈ రోజుకు పస్తులేనా అనుక్గానే అతని హృదయం బరువెక్కింది. కళ్ళు వర్షించడం ప్రారంభించాయి. బయలుదేరడానికి సమాయుత్తమవసాగాడు.
ఇంతలో ఖరీదైన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఆ ముసలి వ్యక్తి ముందు ఆగి అతడు ఏడుస్తుండడాన్ని చూసి సంగతేమిటి అని అడిగాడు. ఆ రోజు ఎవ్వరూ సహాయం చేయలేదని, ఫలితంగా పస్తులు వుండాల్సిందని రాబోతోందన్న విషయం అర్ధం చేసుకొని ఇంకొక మాట మాట్లాడకుండా ఆ ముసలి వ్యక్తిని పక్కకు జరిపి, తాను వయొలిన్ వాయించడం మొదలుపెట్టాడు. అతని వయొలిన్ నుండి అద్భుతమైన స్వరాలు పలకడం ప్రారంభించాయి. ఆ స్వరాలు మృదు మనోహరం గా వుండి అందరినీ అకట్టుకోవడం ఆరంభించాయి. దారిన పోయేవారు ఆగి వాటిని వినడమే కాకుండా విరివిగా డబ్బు కూడా పళ్ళెంలో వేయడం ప్రారంభించారు. ఒక గంటలో ఆ పళ్ళెం పౌండ్లతో నిండిపోయింది.
వాటిని చూసిన ఆ ముసలివ్యక్తి కళ్ళు ఆనందంతో మెరిసాయి. లేచి ఆ వయొలిన్ కళాకారుడు చేతులు పట్టుకొని కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. మానవ రూపంలో వచ్చిన దైవం మీరు. మీ దయ వలన నాకు వారం రోజులకు సరిపోయే ధనాన్ని సమకూర్చారు. మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను. మీ పేరు దయచేసి చెప్పండి అని అడిగాడు.
ఆ మాటలకు చిరునవ్వు నవ్విన ఆ వయొలిన్ వాద్యగాడు " నన్ను పగానిని అని అంటారు" అని మరొక్క మాటైనా మాట్లాడకుండా ముసలి వ్యక్తికి అభివాదం చేసి ముందుకు సాగిపోయాడు.
పగానిని బ్రిటన్ లో ఒక గొప్ప వయొలిన్ కళాకారుడు. . అతని కచేరీలను వినడానికి వందల పౌండ్లు ఖర్చు చేసి వస్తుంటారు. ఆ రోజు చలి ఎక్కువగా వుండడం వలన నిండైన దుస్తులు వేసుకొని ఉండటం వలన ఎవరూ ఆయనను గుర్తుపట్టలేకపోయారు. అంత గొప్ప వాయిద్యకారుడైనా , కష్టాలలో వున్న సాటి మానవుడిని చూసి వెంటనే స్పందించిన అతని వ్యక్తిత్వం అపూర్వం, అసామాన్యం మరియు అద్వితీయం.
సి హెచ్ ప్రతాప్
MOBILE no : 95508 51075

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి