శివా తండ్రి ఆరోజు ఓమద్యంసీసా తెచ్చి తనగదిలో పెట్టడం చూశాడు శివ. వాడిలో ఏదో కుతూహలం!అంతా కాఫీ చాయ్ కోకోకోలా లాంటివి తాగటం చూశాడు కానీ నాన్న కొత్త రకం బాటిల్ తెచ్చాడు ఏంటి? పదేళ్ళ వాడిబుర్ర అంతా దాని చుట్టూ తిరుగుతోంది. నాన్న గదిలో బల్లపైఉన్న ఆసీసా రారమ్మని పిలుస్తోంది. అమ్మ వంటింట్లో బిజీగా ఉంది. మూడు రోజులు వరుసగా సెలవులు రావటంతో శివ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు.బైటకి వెళ్లనివ్వదు అమ్మ. "చంపేస్తా చీరేస్తా!గదిలో పెట్టి తాళం వేస్తా"అని రంకెలేస్తుంది.నిద్రమత్తులో నాన్న గోడలు అదిరేలా అమ్మపైన తనపైన అరుస్తాడు.ఇరుగుపొరుగు కిటికీలోంచి తమాషా చూస్తారు. ఫెడీమని కిటికీలు మూస్తుంది అమ్మ. అందుకే శివా నిశబ్దంగా నాన్న గదిలోకెళ్ళి బల్లపై సీసా మూత తెరచి కొంచెం నోట్లో పోసుకుని కెవ్ న కేక దగ్గుతూ కక్కుతున్నాడు.సీసా వాడి చేతిలోంచి కిందపడి భళ్ళున బద్దలైంది.అమ్మ పరుగులు పెడుతూ వస్తే నాన్న చింతనిప్పులాంటి కళ్ళతో అరుస్తూ సడన్ గా లేవబోయిజర్రున నేలపై జారాడు."అబ్బా" అరిచాడు. మొహం నేలకి ఠాప్ మని తగిలి బొప్పి కట్టింది. "పిల్లాడికి కుతూహలం ఆసీసాలోది కొత్త రకం జ్యూస్ అని! పెద్దవాళ్ళం మనకే విచక్షణ సిగ్గు శరం ఉండాలి. "అని శివాని బాత్రూంలోకి తీసుకుని వెళ్లి వాడిమొహమంతా శుభ్రంగా కడిగి తుడిచింది."పిచ్చి తండ్రి!ఇందాక తిన్న ఇడ్లీ అంతా కక్కేశావు కదరా? ఆవిషాన్ని నోట్లో ఎందుకు పోసుకున్నావు?"అని స్నానం చేయించి పౌడర్ అద్దింది.ఇదంతా చూస్తున్న నాన్న శరీరం బుర్ర గిర్రున తిరిగాయి. పొరుగాయన వచ్చి శివా తండ్రిని లేపుతూ "సార్! మీబాబు చూడండి ఎలా వణికిపోతున్నాడో! మీరు తాగటం మానేయాలి" అనటంతో శివా తండ్రి సిగ్గు తో తలవంచుకున్నాడు🌹
పాఠం!అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి