చేయకు అలుసు! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివా బడికి పరిగెత్తే హడావిడి లో  చొక్కా గుండీ ఊడటం గమనించలేదు.కానీ నాన్న "చొక్కా కి గుండీపెట్టుకో" అని హెచ్చరించాడు."అమ్మా గుండీ ఊడింది" గావుకేక పెట్టాడు."టైం ఐంది "అని అమ్మ పిన్నీసు పెట్టింది.హమ్మయ్య అనుకుంటూ నాన్న  స్కూటర్ పై ఎక్కడం బడిముందు ఆగటం జరిగింది. టీచర్ ఆరోజు  " శివా! బటన్ ఏదీ?" అని అడిగితే సిగ్గు పడుతూ  "పిన్నీసు పెట్టింది  మా అమ్మ "అన్నాడు."అదే సేఫ్టీ పిన్!1849లోఅమెరికన్ వాల్టర్ హంట్ చాలా మంది దగ్గర అప్పు చేశాడు.మరి అప్పుతీర్చటం కోసం  రోజూ కొత్త కొత్త వస్తువులను కనుగొనడం మొదలు పెట్టాడు.వాటికి పేటెంట్ హక్కు పొందాడు. ఒకరోజు హంట్ భార్యపనిమీద బజారు కెళ్ళింది.హఠాత్తుగా డ్రెస్ కి ఉన్న గుండీ ఊడిపోయింది.ఇంటికి వచ్చి విషయం చెప్పింది.హంట్ వెంటనే చిన్న తీగముక్కను పిన్ను లాగా వంచాడు.దాన్ని బటన్ స్థానంలో గుచ్చాడు.అలా చేర్పులు మార్పులతో పిన్నీసు తయారైంది. దాన్ని డ్రెస్ పిన్ను అనేవారు. వేలుకి గుచ్చుకోకుండా దుస్తులు కదలకుండా ఉండటంతో సేఫ్టీ పిన్ అన్నారు. ఆరోజుల్లో మగవారు తమ షర్ట్ కాలర్ చెక్కు చెదరకుండా  ఉండేందుకు దీన్ని వాడారు. "టీచర్ చెప్పిన  వివరాలతో పిల్లలకి అర్ధం ఐంది  ఏచిన్న విషయం వస్తువుని కూడా  చిన్న చూపు చూడరాదని అలుసు చేయడం తగదు అని తెలుసుకున్నారు🌹
కామెంట్‌లు