సుప్రభాత కవిత ; - బృంద
ఏ జ్ఞాపకాలు తరుముతుంటే
గమనం  ఆగిపోయిందో!

ఏ గాయం మదిని సలిపితే
కనుకొలకుల చెలమ ఊరిందో!

ఏ మలుపున ఏ గెలుపు కోసం
మనసు వాకిట  వేచి ఉందో?

ఏ గుండె అడుగున పొర కదిలిందో
ఎంత తడి  పేరిందో!

ఏ ఊహలు మదిలో మెదిలాయో
ఎద ఎంతగ కదిలిపోయిందో!

ఏ కారణానికి ఏ కలతలో
ఏ కాలంతో ఎంత రణమో!ఋణమో!

ఏ దారి ఎటు పోతుందో
ఎవరు ఎవరికి ఎంత వరకూ తోడో

అయోమయాలు తొలగించి
ప్రేమ మయం చేసే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸
  


కామెంట్‌లు