సుప్రభాత కవిత ; -బృంద
తూరుపు  కొండల  నిలిచే రూపు
దూరపు నింగిని మెరిసే  వెలుగు

పొగమంచు మేఘాల
పొగరు దింపే వెలుగు

చిక్కటి చీకటి  వనాల
సందుల కురిసే వెలుగు

తెమ్మెరల రెక్కలపై ఊరేగుతూ
అవని అణువణువూ ఆవరించే వెలుగు

ముచ్చటగ విరిసిన పువ్వుల 
పెదవుల నవ్వులు పూయించు వెలుగు

పచ్చని  నేలతల్లి ముంగిట
మంచు ముత్యాల  మెరిపించు
వెలుగు

కఠిన శిలను కూడా  స్పర్శించి
ప్రేమను కురిపించు వెలుగు

కదలని నీట తన కమ్మని
రూపు  కనులార చూసుకునే
వెలుగు

జగతికి కొత్త రోజును
కానుకగ ఇచ్చే వెలుగు

బ్రతుకున మంచి మలుపు
ఎంచి తెచ్చే వెలుగుకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు