తల!!!?; - సునీతా -ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
అదిగో
వాళ్ళు అక్కడ
భూమిని తవ్వుతున్నారు!!?

ఒకచోట
బంగారం బయటపడింది!

మరోచోట
బొగ్గు బయటపడింది!!

ఒకచోట
పెట్రోలు బయటపడింది!!!

మరోచోట
మనుషుల సమాధులు బయటపడినవీ!!?

ఎందుకు వాళ్లు అక్కడ
మళ్లీ మళ్లీ త్రవ్వుతున్నారు!!?
కూడబెట్టడానికి కాదు

మనిషిని మనిషే పూడ్చీపెట్టేందుకు
భూమిని తవ్వుకుంటున్నారు!!?

ఎక్కడ ఉండాల్సినవి
అక్కడే ఉన్నాయి
ఒక్క మనిషి తప్ప!!?

ఉన్నచోటనే ఉన్న మనిషి
ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు

మనిషి మాట మంత్రం కాదు
యంత్రం!!!

ఇప్పుడు
విశ్వానికి తల భూగోళం!!
మనిషి తల ఖగోళం!!?

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
ముగింపు హైలైట్... అభినందనలు.